Siddharth Saina Nehwal.. ఎంత ఎదిగినా ఒదిగే వుండాలన్నది పెద్దలు చెప్పే మాట. కానీ, ఎదిగామో లేదో తెలుసుకోకుండా, ఎదిగేశామనుకునే అహంకారంతో పాతాళానికి పడిపోతున్నారు కొందరు. అసలెందుకీ పతనం.? ‘మేధావితనం’ చాటుకోవాలంటే తమ స్థాయిని దిగజార్చేసుకోవాలా.? ప్రశ్నించేతత్వం.. పేరుతో పైత్యాన్ని ప్రదర్శించెయ్యాలా.?
సినీ నటుడు సిద్దార్ధ తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ విషయంలో చేసిన సోషల్ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సైనా నెహ్వాల్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పేర్కొంటే, దానికి కౌంటర్ ఇచ్చాడు సిద్దార్ధ.
సోషల్ స్వాతంత్ర్యాన్ని ఎగతాళి చేసి..
సైనా నెహ్వాల్ స్పందించడం తప్పు కాదు, ఆ స్పందనపై సిద్దార్ధ కౌంటర్ ఎటాక్ చేయడం కూడా తప్పు కాదు. కానీ, ఇక్కడ సిద్దార్ధ ఉపయోగించిన పదాలే అభ్యంతరకరం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా చెప్పవచ్చు. కానీ, అలా చెప్పే క్రమంలో హద్దులు దాటడం, ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపర్చే ప్రయత్నం చేయడం తగదు.

సోషల్ మీడియా వేదికగా అడపా దడపా నీతులు చెప్పే సిద్దార్ధ, ఓ మహిళ పట్ల ‘డబుల్ మీనింగ్’ డైలాగులు పేల్చడం ఎంతవరకు సబబు.? అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేకపోవడం కాదు, కావాలనే సిద్దార్ధ ట్వీటు జారాడు. ఇంకేముంది, వివాదాల్లోకెక్కాడు.
Siddharth Saina Nehwal పబ్లిసిటీ కోసమేనా ఈ దిగజారుడుతనం.?
కేవలం పబ్లిసిటీ కోసమే సిద్దార్ధ ఇలా దిగజారాడా.? అంటే, ‘కాదు’ అని తేలిగ్గా కొట్టి పారేయలేం. ఈ వివాదంతో సిద్దార్ధకి బోల్డంత పబ్లిసిటీ వచ్చిపడింది. అదే సమయంలో, ఆయన పట్ల చాలామందికి వున్న గౌరవం ఇప్పుడు గల్లంతయ్యింది. సిద్దార్ధని అభిమానించేవారూ ఇప్పుడాయన్ని ఈ విషయంలో సమర్థించలేకపోతున్నారు.
Also Read: దేవిశ్రీ ప్రసాదం.! ఐటమ్ సాంగ్ అనబడు భక్తి గీతం.!
చేసిన తప్పేంటో అర్థం చేసుకోలేని అమాయకుడైతే కాదు సిద్దార్ధ. కానీ, ‘కవరింగ్’ ట్వీట్ ఇంకోటి వేశాడు.. మరింతగా వివాదాల్లోకెక్కాడు. బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధించి స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్. క్రీడా రంగంలో ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అలాంటి సైనా నెహ్వాల్ మీద ( Siddharth Saina Nehwal ) అభ్యంతర కామెంట్లు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనం.
అహంకారం ఎవర్నయినా అదఃపాతాళానికి తొక్కేస్తుంది. సిద్దార్ధ ఇందుకు మినహాయింపేమీ కాదు.
చివరగా.. సైనా నెహ్వాల్ సాధించిన విజయాల్ని మన విజయాలుగా మురిసిపోయాం. ‘మన సైనా నెహ్వాల్..’ అని ఘనంగా చెప్పుకున్నాం. ఈ రోజు ఆమె అవమానం జరిగిందంటే, అది మనందరికీ జరిగిన అవమానమే. సిద్దార్ధ కూడా తనను తాను అవమానించుకున్నట్లే అయ్యిందిప్పుడు.