Silk Smitha Chandrika Ravi.. సిల్క్ స్మిత గుర్తుందా.? అదేనండీ, ‘సిలుక్కు స్మిత’ అని కూడా పిలిచేవారు కదా.! ఆ వ్యాంప్ గురించే.! ఆ ఐటమ్ బాంబు గురించే ఇదంతా.!
మరీ, వ్యాంప్ అనీ.. ఐటమ్ బాంబ్ అనీ.. అనడం ఎంతవరకు సబబు.? శృంగార తార అనొచ్చా.? ఏదైనా నటనే కదా.! కాకపోతే, తనకు వచ్చిన పాత్రల్ని.. దర్శకులు సూచించిన విధంగా చేసుకుంటూ పోయిందామె.!
తెలుగుతోపాటు వివిధ భాషల్లో సిల్క్ స్మిత (Silk Smitha) సినిమాలు చేసింది. ఆమె చేసిన పాత్రలు, ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్.. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ వేరే లెవల్ అంతే.!
Silk Smitha Chandrika Ravi.. సిల్క్ స్మిత జీవితంలో చీకటి కోణాలు..
సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకుంది సిల్క్ స్మిత (Silk Smitha). కానీ, జీవితం చివరి రోజుల్లో, అత్యంత దారుణమైన పరిస్థితుల్ని ఆమె ఎదుర్కొంది.
బాలీవుడ్‌లో ‘డర్టీ పిక్చర్’ పేరుతో ఓ సినిమా వచ్చింది. బాలీవుడ్ నటి విద్యా బాలన్ (Vidya Balan)కి అనూహ్యమైన స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టిన సినిమా అది.

ఆ ‘డర్టీ పిక్చర్’ (Dirty Picture), సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగానే తెరకెక్కిందిగానీ, బోల్డన్ని వివాదాలు.! కాసుల కక్కుర్తి కోసమే ఆ సినిమా తీశారన్న విమర్శలు లేకపోలేదు ‘డర్టీ పిక్చర్’ మీద.
మరిప్పుడు తెరకెక్కుతోన్న బయోపిక్ సంగతేంటి.? సిల్క్ స్మిత జీవితంలో జరిగిన సంఘటనల్ని యధాతథంగా తెరకెక్కిస్తారా.?
ఈమె కూడా శృంగార తారే.!
అన్నట్టు, ఈ కొత్త బయోపిక్‌లో సిల్క్ స్మితలా కనిపించబోయేది ఎవరో కాదు, ఇంకో శృంగార తార చంద్రిక రవి.!
ఈ ఎన్నారై భామ, తెలుగులో ‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy) అనే సినిమా చేసింది. అందులో బాలయ్యతో (Nandamuri Balakrishna) కలిసి ఓ ఐటమ్ సాంగులో చిందులేసింది చంద్రికా రవి.
Also Read: Mehreen Pirzada.. పచ్చ పచ్చని పంచదార చిలకా.!
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, సిల్క్ స్మితలా పెర్‌పెక్ట్‌గా సూటయిపోయిందీ భామ.! చూస్తున్నారుగా.. అచ్చుగుద్దినట్టు అలాగే చంద్రిక రవిని (Chandrika Ravi) మార్చేశారు బయోపిక్ కోసం.!