Silk Smitha Death Mystery.. సిల్క్ స్మిత.. ఈ పేరుకు గ్లామర్ ప్రపంచంలో పరిచయమే అక్కర్లేదు. ఆ పేరు వింటే చాలు ఏదో తెలియని మత్తు, గమ్మత్తు.. ఐటెం గాళ్‌గా తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుంది సిల్క్ స్మిత. తన తొలి సినిమాలోని పాత్ర పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్హ్మి.
పెద్దగా చదువుకోలేదు. కానీ, చాలా తెలివైంది. నిరుపేద కుటుంబం కావడంతో, చిన్న వయసులోనే (15 ఏళ్లు) పెళ్లి చేసేశారు. అత్త మామల వేధింపులు పడలేక ఇంట్లోంచి పారిపోయింది. చిన్నతనం నుండీ సినిమాలపై ఉన్న ఇష్టంతో మద్రాసు సినీ ఇండస్ర్టీలో కష్టపడి ఎలాగో చిన్న చోటు దక్కించుకుంది.
Silk Smitha Death Mystery.. అసలేం జరిగింది.?
మొదట్లో టచప్ ఆర్టిస్టుగా పని చేసిన, సిల్క్ తనదైన అందంతో అడపా దడపా సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు దక్కించుకుంది. ఆ తర్వాత ఐటెం గాళ్‌గా అవతారమెత్తి తనలోని అందాలకు పదును పెట్టింది. అప్పటికే ఐటెం సాంగ్స్‌కి జ్యోతిలక్ష్మి, జయమాలిని తదితర అందగత్తెలున్నప్పటికీ సిల్క్ వాళ్లకు గట్టి పోటీ ఇచ్చి, తన రూటే సెపరేటు అనిపించుకుంది.

ఐటెం సాంగ్స్, వ్యాంప్ పాత్రలతో పాటు, ‘సీతాకోక చిలక’ తదితర సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, అప్పట్లో హీరోలకు ధీటుగా రెమ్యునరేషన్ అందుకుని అదరహో అనిపించుకుంది. ఎంత ఎదిగినా ఒదిగా ఉండాలన్న తత్వం ఆమెది. ఎందరో పేద విద్యార్ధులకు తన వంతుగా సాయం చేసేది.
మోసపోయింది.. చనిపోయింది..
అతి తక్కువ సమయంలోనే, గ్లామర్ ప్రపంచంలో ఉన్నత శిఖరాలు అందుకున్న సిల్క్, అర్ధాంతరంగా తనువు చాలించింది. ఒకానొక సమయంలో చుట్టూ ఉన్న వాళ్ల చేతుల్లోనే దారుణంగా మోసపోయింది. ఆర్ధికంగా నష్టపోయింది. తాగుడుకు బానిసైంది.
Also Read: శ్రియా.. సీక్రెట్‌గా ‘ఆ పని’ ఎందుకు చేశావ్.?
చివరికి ఏమైందో ఏమో తెలీదు కానీ, సెప్టెంబర్ 23 1996లో సిల్క్ స్మిత, ఫ్యానుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. అలా గ్లామర్ ప్రపంచంలో చెరిగిపోని ముద్రవేసి, తనని తాను బలవంతంగా అంతం చేసుకుంది. ఐటెం గాళ్‌గా, డాన్స్ క్వీన్‌గా ఇండస్ర్టీని ఓ ఊపు ఊపేసిన సిల్క్ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే.
