Singer Mangli Vulgar Song.. కన్నడ సినిమా అది.! హిందీ వెర్షన్ పాట వివాదాస్పదమయ్యింది. తెలుగు సింగర్ మంగ్లీ వివాదంలో ఇరుక్కుంది.!
పాట వైరల్ అయ్యింది.. బావుందని కాదు, జుగుప్సాకరమైన పదజాలం వాడారని. ఐటమ్ బాంబ్ నోరా ఫతేహీ విచ్చలవిడి అందాల ప్రదర్శన కూడా, ఆ బూతు పదాల ముందర తేలిపోయింది.
అసలు తెలుగమ్మాయ్ మంగ్లీ, అంత పెద్ద బూతు పాటని ఎలా పాడిందో.! ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. చేసేది లేక, మంగ్లీ క్షమాపణ చెప్పేసింది.
అన్నట్టు, ఆ పాటని ఆల్రెడీ అన్ని మాధ్యమాల నుంచీ తొలగించేశారు. కొత్త లిరిక్స్‌తో ఆ పాటని మళ్ళీ రిలీజ్ చేస్తారట. ఈ విషయమై చిత్ర యూనిట్ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది.
Singer Mangli Vulgar Song.. అందరూ క్షమాపణ చెప్పినాగానీ..
చిత్ర నిర్మాణ సంస్థ, సంగీత దర్శకుడు, పాటలో డాన్స్ చేసిన నోరా ఫతేహీ, పాట పాడిన మంగ్లీ.. ఇలా అందరూ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
ఇంతకీ, కావాలనే బూతు పాటని డిజైన్ చేశారా.? వివాదాస్పదమవుతుందని తెలిసే, పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగా అలా చేశారా.? ఇప్పుడు ఇదే ప్రశ్న చుట్టూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సినిమా పేరు ‘కేడీ ది డెవిల్’. ఈ సినిమాలో ధృవ్ సర్జా హీరోగా నటించాడు. కన్నడతోపాటు హిందీ, తెలుగు, తమిళ.. ఇలా పలు భాషల్లో ఈ సినిమాలో విడుదల కానుంది.
అయినా, బూతు పాటలు కొత్తేమీ కాదు సినిమాల్లో. అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఈ పైత్యం వుంది. మన తెలుగు సినీ పరిశ్రమనే తీసుకుంటే, బోల్డన్ని బూతు పాటలొచ్చాయ్.
పైసలిస్తే నిస్సిగ్గుగా బూతులు పాడెయ్యడమేనా.?
చాలామంది తెలుగు సింగర్లు, అచ్చ తెలుగులోనే బూతులు పాడటం చూశాం. అలాంటిది, ఆ పాటల విషయంలో ‘తొలగింపు’ అనేది జరిగిన దాఖలాల్లేవ్.
డైలాగుల్లో అప్పుడప్పుడూ పదాల్ని రీప్లేస్ చేయడం చూస్తుంటాం. చాలా అరుదుగా లిరిక్స్ మార్చిన సందర్భాలూ లేకపోలేదు.. దానికి వేరే కారణాలున్నాయ్.
సింగర్ మంగ్లీకి హిందీ బాగానే వచ్చు. లిరిక్స్ ఏంటో ఆమెకి తెలుసు. అవి అర్థం చేసుకుని కూడా, ‘ఈ పాట నేను పాడలేను’ అనలేకపోయింది మంగ్లీ. అలా ఎలా.?
స్టార్డమ్ వచ్చేసింది గనుక, తాను ఏం చేసినా చెల్లిపోతుందని బహుశా మంగ్లీ అనుకుని వుండాలి.
ఐటమ్ బాంబ్ నోరా ఫతేహీ విషయానికొస్తే, ఆమెకి లిరిక్స్‌తో పని లేదు. కాస్ట్యూమ్స్ విషయంలోనూ పెద్దగా అభ్యంతరాలేమీ వుండవామెకి.
సో, ఇక్కడ నోరా ఫతేహీ తెరపై అసభ్యంగా కనిపించడాన్ని తప్పు పట్టలేం. తప్పంతా మంగ్లీదే అయిపోయిందిప్పుడు. క్షమాపణతో, డ్యామేజ్ కంట్రోల్ అయినట్లేనా.?
