Single Simham.. సినిమాల్లో డైలాగులు వేరు.. నిజ జీవితం వేరు.! అదీ, ఇదీ ఒకటే అనుకుంటే ఎలా.?
హీరో లాగిపెట్టి గుద్దితే.. విలన్ ఏకంగా ఐదారు మీటర్లు ఎగిరి ఎక్కడో పడతాడు. నిజ జీవితంలో అలా జరగదు కదా.?
రెండున్నర గంటల నిడివిగల సినిమాలో.. ఒక్క జీవితం కాదు, చాలా చాలా జీవితాల్ని చూపించేస్తుంటారు.. పుట్టడం నుంచి చావడం వరకూ.!
స్కూలుకి చిన్నబ్బాయిగా వెళ్ళే హీరో, జస్ట్ నిమిషాల వ్యవధిలో పెద్దోడైపోతాడు. అది సినిమా.! సవిమాని, సినిమాలానే చూడాలి.
పేదరికంలో మగ్గే హీరో, రోజుల వ్యవధిలో కోటీశ్వరుడైపోవడం సినిమాల్లో చూస్తుంటాం. నిజ జీవితంలో అది సాధ్యమా.?
ఇప్పుడిదంతా ఎందుకంటే, ‘సింగిల్ సింహం’ గురించి తరచూ చర్చ జరుగుతుంటుంది. ‘సింహం సింగిల్‌గానే వస్తుంది..’ అని ఓ హీరో ఓ సినిమాలో డైలాగ్ చెప్తాడు.
Single Simham.. సినిమాలో సింగిల్ సింహం వేరు..
ఇంతకీ, సింహం సింగిల్‌గానే వస్తుందా.? అసలు సింహం అనే జంతువు, సింగిల్‌గా జీవనం సాగించగలదా.? ప్చ్.. కష్టమే.
పులి కథ వేరు.. అది సింగిల్‌గానే వుంటుంది. సింహం అలా కాదు. అది మృగరాజు. సింహాల సమూహానికి రాజుగా వ్యవహరించడానికి తహతహలాడుతుంది.
సింహం రాజకీయాలు చేయదు.. సింహం అస్సలు అబద్ధాలు చెప్పదు.. సింహానికి మతం లేదు.. సింహానికి కులం కూడా లేదు.!
Mudra369
నిజానికి, సింహం చాలా ఎక్కువ సేపు నిద్ర పోతుంది. రోజులో 15 గంటలకు పైనే సింహం నిద్రపోతుంది. బయట తిరగడం, వేటాడటానికి ఎక్కువ సమయం కేటాయించదు.
కానీ, సింహం దేనితోనూ వేటాడబడదు. అది దేన్నయినా వేటాడగలదు. అదే సింహం ప్రత్యేకత. వేటాడేటప్పుడు కూడా, అవసరాన్ని బట్టి, తన గ్యాంగ్‌లోని మిగతా సింహాలకు నాయకత్వం వహిస్తుంటుంది.
వయసు మీద పడ్డాక, ‘లీడర్’ సింహం, తన నాయకత్వాన్ని, తన గ్యాంగ్‌లో సమర్థత కలిగిన ఇంకో సింహానికి అప్పగిస్తుందిట.
Also Read: తల్లి చిన్మయి, తండ్రి రాహుల్.! ఓ చిన్నారి.. వ్యధ.!
ఒక్కటి మాత్రం నిజం. సింహం సింగిల్‌గా వేటాడగలదు. ఏనుగునైనా ఒంటరిగానే పడగొట్టగలదు. అయినాగానీ, సింహాలు సమూహంగానే వేటాడతాయ్.
అన్నట్టు, ‘సింగిల్ సింహం’ అంటే, సమూహం నుంచి వెలివేయబడిందై వుంటుంది.. లేదంటే, వేటాడలేని స్థితిలో.. కాటికి కాళ్ళు చాపుకుని వుంటుందిట.!