Skanda Boyapati Over Action.. ‘టెన్షన్ లేదా.? అని అడిగితే.. టెన్షన్ ఎందుకు.! నేను సినిమా చాలా బాగా తీశాను..’ అంటున్నాడట దర్శకుడు బోయపాటి శీను.
అదేనండీ మరికొద్ది రోజుల్లో ‘స్కంధ’ రిలీజ్ వుంది కదా.! ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బోయపాటి శీను ముందుకు ఓ ప్రశ్న తలెత్తింది.. ‘రిలీజ్ టెన్షన్ లేదా.?’ అని.
అందుకు ఆయన ఇచ్చిన సమాధానమే ఇది. ఎంత బాగా తీసినా సినిమా రిలీజ్ అవుతోందంటే చిత్ర యూనిట్లో వుండే గుబులు అంతా ఇంతా కాదు.
Skanda Boyapati Over Action.. అది తేల్చాల్సింది ఆడియన్స్ బాసూ.!
కానీ, బోయపాటి శీను చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. కాన్ఫిడెంట్‌గా వుండడం తప్పు కాదు కానీ, ‘నేను చాలా బాగా తీశాను..’ అని చెప్పడమే కాస్త ఓవర్ అనిపిస్తోంది.. అంటూ సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
ఎంత బాగా తీశారన్నది సినిమా రిలీజయ్యాకా.. హిట్టా.? ఫట్టా.? అని ఆడియన్స్ తేల్చినదాని మీద బేస్ అయ్యుంటుంది.
గతంలో ఈయన తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ సినిమా విషయంలోనూ రిలీజ్‌కి ముందు ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించారాయన.
ఏమైంది.! రిలీజ్ తర్వాత తుస్సుమంది. రామ్ చరణ్ సినిమా కాబట్టి.. డిజాస్టర్ టాక్‌తోనూ ఎటువంటి నష్టాలు లేకుండా నిర్మాతలు బతికి బట్ట కట్టగలిగారా సినిమాతో.
రామ్ – శ్రీలీలా ఇద్దరికీ అగ్ని పరీక్షే.!
కానీ, ‘స్కంధ’ విషయంలో అలాంటి గ్యారంటీ ఏముంది.? అసలే రామ్ ‘వారియర్’తో దెబ్బ తినేసి వున్నాడు. ఈ సినిమాకి చూస్తే విపరీతమైన పబ్లిసిటీ తప్ప ఆడియన్స్‌లో అంతగా రీచ్ కనిపించడం లేదు.
తెలుగుతో పాటూ, తమిళ తదితర భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. దాంతో, రామ్‌కి ఈ సినిమా హిట్టు తప్పనిసరి.
రిజల్ట్ తేడా కొట్టిందంటే గల్లంతైపోతాడంతే. ఇక శ్రీలీల విషయానికి వస్తే.. ఆమె చేతిలో చాలా సినిమాలున్నాయ్. వాటన్నింటికీ ఈ సినిమా హిట్టే ప్రామాణికంగా మారింది.
Also Read: Nazriya Nazim.. నెగిటివ్ రోల్లో నాని హీరోయిన్.!
ఈ సినిమా రిజల్ట్ బెడిసికొట్టిందంటే శ్రీలీల తదుపరి సినిమాలపైనా ఆ ఇంపాక్ట్ చాలా గట్టిగా పడుతుంది. శ్రీలీల, రామ్ డాన్సులే సినిమాని కాపాడాలి.
అంతేకాదు, పెయిడ్ ప్రమోషన్లు తప్ప.. ఆర్గానిక్ బజ్ కూడా ఈ సినిమాపై ఇంతవరకూ కనిపించకపోవడం ‘స్కంధ’కి మరో మైనస్.!
ఇలా ఒక్కటి కాదు.. ఇన్ని అగ్ని పరీక్షలు తట్టుకుని ‘స్కంధ’ విజయం దిశగా ఎలా పరుగులు తీస్తుందో చూడాలి మరి.!