Skyroot Vikram Telugu Pride.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సాయంతో ‘స్కైరూట్’ అనే ఓ ప్రైవేటు సంస్థ, తమ రాకెట్‌ని నింగిలోకి విజయవంతంగా పంపింది.
‘విక్రమ్-1’ పేరుతో రూపొందిన ఆ రాకెట్ నుంచి నింగిలోకి ‘పేలోడ్’ కూడా విజయవంతంగా వెళ్ళింది. నిర్దేశిత కక్ష్యలోకి పేలోడ్‌ని విజయవంతంగా పంపడం ద్వారా ప్రపంచ వ్యాప్త గుర్తింపుని దక్కించుుంది స్కైరూట్.
స్కైరూట్ వ్యవస్థాపకులిద్దరూ గతంలో ‘ఇస్రో’లో పనిచేసినవారే. పైగా, ఇద్దరూ తెలుగువారే కావడం గమనార్హం. సినీ, రాజకీయ ప్రముఖులు ‘స్కైరూట్’ ఘనతని కొనియాడుతున్నారు సోషల్ మీడియా వేదికగా.
మరోపక్క, ‘టీ హబ్’లోనే ‘స్కైరూట్’ సంస్థకు అంకురార్పణ జరిగిందంటూ, క్రెడిట్ చోరీ వ్యవహారాలకు తెరలేపడం మరో ఆసక్తికరమైన అంశం.
షరామామూలుగానే, ‘మీరు ఏమిట్లు.?’ అన్న ప్రశ్న ‘స్కైరూట్’ వ్యవస్థాపకులకు సోషల్ మీడియా వేదికగా వస్తోంది.
వివరాల్లోకి వెళితే, పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా ‘స్కైరూట్’ సంస్థని ప్రారంభించారు. ఇద్దరూ ఐఐటీల్లోనే విద్యనభ్యసించారు.
‘స్కైరూట్’ సంస్థ 2018లో ప్రారంభం కాగా, 2022లో తొలి రాకెట్ ‘విక్రమ్’ని విజయవంతంగా ప్రయోగించారు. విక్రమ్-2 రాకెట్ కూాడా తయారీ దశలో వుంది.
తక్కువ బరువుతో కూడిన ఉపగ్రహాల్ని త్రీడీ ప్రింటెడ్ ఇంజిన్ సాయంతో తక్కువ ఖర్చుతోనే అంతరిక్ష్యంలోకి పంపేలా ఈ సంస్థ తమ కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది.
నిజానికి, ‘స్కైరూట్’ సంస్థ తెలుగువాళ్ళకే కాదు, దేశ ప్రజలందరికీ గర్వకారణం. తెలుగు రాష్ట్రాలకి ఇంకాస్త ప్రత్యేకం. ఆ మాటకొస్తే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇంకాస్త ఎక్కువ గర్వకారణం.
ఇద్దరూ తెలుగువారే.. ఒకరు ఆంధ్ర ప్రదేశ్‌కి చెందినవారైతే, ఇంకొకరు ఆంధ్ర ప్రదేశ్ మూలాలున్న వ్యక్తి. ఇంతకీ, వీళ్ళది ఏ సామాజిక వర్గం.? ఇదే, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట టాపిక్.
ఇంతకన్నా నాన్సెన్స్ ఇంకేమైనా వుంటుందా.? అదే, తెలుగు నేలపై వున్న పెద్ద జాడ్యం. ఒక చిన్న ఆలోచన.. అది స్టార్టప్‌గా మారింది.. అద్భుతాలు సృష్టిస్తోంది.
మరి, ఇంతటి అద్భుతం వెనుక ఎంతటి కృషి, పట్టుదల వుండాలి.? అవన్నీ వదిలేసి, ఈ కులాల ప్రాంతాల పంచాయితీ ఏంటి.? అదో మాయ రోగం అంతే.!
ఈ పైత్యాన్ని పక్కన పెడితే, స్కైరూట్ సంస్థకి కంగ్రాట్స్ మరియు ఆల్ ది బెస్ట్.! సంస్థ వ్యవస్థాపకులు పవన్, నాగ భరత్ మరిన్ని విజయాలు అంతరిక్ష ప్రయోగాల్లో అందుకోవాలని ఆశిద్దాం.
