Slippers Thief Political Dog.. ఒకాయన చెప్పులు పోగొట్టుకున్నాడట.! ఇంకొకాయన, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పులు చూపిస్తాడట.! ఈ కథలో నీతి ఏంటి.?
‘ఇదిగో రెండు చెప్పులు..’ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తాడా పెద్దమనిషి ముసుగేసుకున్న ‘మరుగుజ్జు’ మనిషి.! మనిషేనా.? అనడగొద్దు.. అదంతే.!
మరుగుజ్జు అంటే.. పొట్టీ.. పొడుగూ.. తేడా కాదు.! ఇది మనిషి ఆలోచనలకు సంబంధించిన విషయం. విషయ పరిజ్ఞానం లేనోడని.!
Slippers Thief Political Dog.. అయ్యో పాపం.. చెప్పులు పోయాయా.?
చెప్పులు పోగొట్టుకున్న వ్యక్తేమో, ‘నా చెప్పులు నాకు తెచ్చివ్వండి’ అంటాడు.! అందులో తప్పేముంది.?

దానికి, ఇంకొకాయన జేబులు తడిమేసుకుంటాడు. పోగొట్టుకున్న వ్యక్తి ఎవరి పేరూ చెప్పలేదు కదా.? ఎందుకు ఇంకొకాయన తడుముకుంటున్నట్లు.?
అంటే, ‘నేనే దొంగని’ అని పరోక్షంగా ఒప్పేసుకున్నట్టే కదా.? ఇలా తగలడింది, అతగాడి ఆలోచన.!
ఎవడ్రా అది.. చెప్పులు కొట్టేసింది.?
పనికొచ్చే పనులు చేయండ్రా అని ప్రజలు పదవులిస్తే, ఇలా చెప్పులు కొట్టేయడమేంటి.? పోనీ, కొట్టేయలేదు.. చెప్పుల మీద ప్రెస్ మీట్లు పెట్టడమేంటి.?
సిగ్గుండక్కర్లా.? అసలంటూ ఆ సిగ్గే వుంటే, ఇలా ఎందుకు ‘చెప్పుల దొంగ జేబులు తడుముకునే’ పరిస్థితి వస్తుంది.?