Snake Bite.. పాము కాటేస్తే.. ఆ భయంతోనే కొందరు చచ్చిపోతుంటారు.! కాస్త ధైర్యం వున్నవాళ్ళైతే ప్రాణాల్ని కాపాడుకునేందుకు ఆసుపత్రికి పరుగులు తీస్తారు.
చాలా సందర్భాల్లో పాముల్ని చంపేస్తుంటారు.! కానీ, ఇక్కడో వ్యక్తి పెద్ద సాహసమే చేశాడు.! కాటేసిన పాముని ఏకంగా ఆసుపత్రికి తీసుకెళ్ళాడతడు.
అయితే, పాము కాటేసింది ఆ వ్యక్తిని కాదు, ఆయన భార్యని.! ఉత్తర ప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. అతని పేరు నరేంద్ర.
నరేంద్ర భార్య కుష్మా పాము కాటుకి గురయ్యింది. దాంతో, వెంటనే తన భార్యని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు.
కానీ, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కారణం, నరేంద్ర చేతిలో ఓ సంచి, అందులో పాము వుండటమే.!
Snake Bite.. తెలివైనోడే సుమీ..
పామునెందుకు తీసుకొచ్చావ్.? అని ఆసుపత్రి సిబ్బంది ప్రశ్నిస్తే, ‘ఏ పాము కరిచిందో తెలిస్తే, తన భార్యకు వైద్యం సులువవుతుంది కదా.. అని ఆలోచించి అలా చేశా’ అని సమాధానమిచ్చాడట నరేంద్ర.
తొలుత ఆశ్చర్యపోయినా, అతని ముందు చూపుకి ఆసుపత్రి సిబ్బంది మెచ్చుకున్నారు. కానీ, అలా పాముని తీసుకురావడం ప్రమాదకరమని అతన్ని హెచ్చరించారు.
పాము కాటుకి గురైన కుష్మకి వైద్యులు తగిన వైద్య చికిత్స అందించడంతో ఆమె కోలుకుంది.!
జీవిత భాగస్వామిని అతి కిరాతకంగా చంపేసి, వారి శరీర భాగాల్ని (ముఖ్యంగా తలకాయల్ని) పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్ళి లొంగిపోయేటోళ్ళని వార్తల్లో చూస్తుంటాం.
కానీ, ఇది కాస్త వెరైటీ కదా.!