Sneha Ullal Zareen Khan.. సినిమాల్లో రిస్కీ స్టంట్స్ కోసం డూపుల్ని వాడుతుంటారనేది అందరికీ తెలిసిన విషయమే.
నటీనటులు డబుల్ రోల్స్ లేదా ట్రిపుల్ రోల్స్ చేసినప్పుడూ ఈ డూపుల వాడకం తప్పనిసరి.!
కానీ, డూపులు కాని, డూపుల గురించి విన్నారా ఎప్పుడైనా.? నిజానికి వీళ్ళు డూపులు కాదు, ఒరిజినల్. కాకపోతే, ‘జూనియర్’ అనే ట్యాగ్ ఒకటి వీళ్ళకి తగిలించేయబడుతుంది.
ఆ లిస్టులో జూనియర్ కత్రినా కైఫ్, జూనియర్ ఐశ్వర్యారాయ్ పేర్లు ముందు వరుసలో వుంటాయ్. ఈ ఇద్దరికీ ఓ స్పెషాలిటీ డా వుంది.!
Sneha Ullal Zareen Khan.. ఎవరా జూనియర్లు.!
స్నేహా ఉల్లాల్ గుర్తుంది కదా.? తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీకి జూనియర్ ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) అనే గుర్తింపు వుంది. అప్పట్లో ఈ ట్యాగ్‌ని ఆమె భలే ఎంజాయ్ చేసింది కూడా.
ఇక, కత్రినా కైఫ్‌ని పోలి వుండే జరీన్ ఖాన్ (Zareen Khan) కూడా ఒకప్పడు బాలీవుడ్‌లో సంచలనం. ఈ బ్యూటీ కూడా తెలుగులో ఓ సినిమా చేసింది. అదీ గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ఓ సినిమాలో.

అటు స్నేహా ఉల్లాల్ (Sneha Ullal), ఇటు జరీన్ ఖాన్.. ఈ ఇద్దరికీ మళ్ళీ ఓ లింకు వుంది. వీళ్ళని పాపులర్ చేసింది ప్రముఖ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan).
అసలు కథేంటంటే..
సల్మాన్ ఖాన్, ఒకప్పుడు ఐశ్వర్యా రాయ్‌ని గాఢంగా ప్రేమించాడు. కానీ, ఆమెతో సంబంధాలు తెగాక, ఆమెను పోలి వుండే స్నేహా ఉల్లాల్‌ని బాలీవుడ్‌లో ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టాడు సల్మాన్ ఖాన్.
సేమ్ టు సేమ్, జరీన్ ఖాన్ విషయంలోనూ అదే జరిగింది. సల్మాన్ ఖాన్ కొత్త ప్రియురాలనే ముద్ర కూడా ఈమె మీద పడింది.
Also Read: రాధికా ఆప్టే భర్త ‘వేస్టు’ అట.! ‘కో-ఆపరేట్’ చెయ్యడట.!
కత్రినా కైఫ్ (Katrina Kaif) మీద చాలా ఆశలు పెంచుకుని, ఎక్కడో తేడా కొట్టేయడంతో.. అచ్చం ఆమెలా వుండే జరీన్ ఖాన్‌ని తన సినిమాతోనే పరిచయం చేశాడు ఈ బాలీవుడ్ కండల వీరుడు.
అద్గదీ అసలు సంగతి.! ఇదీ ఈ డూపుల కహానీ.! వీళ్ళు డూపులు కాదు, ఒరిజినల్.!