Social Media Blue Tick.. అంతా మీ ఇష్టమే.! మీక్కావాలంటే బ్లూ టిక్ కొనుక్కోండి.. లేదంటే, మామూలుగానే వుండండి..’ అంటున్నాయి సామాజిక మాధ్యమ సంస్థలు.
ఎప్పుడైతే ట్విట్టర్ సంస్థ ‘ప్రపంచ కుబేరుడు’ ఎలాన్ మస్క్ చేతికి వెళ్ళిందో, అప్పటినుంచి ‘బ్లూ టిక్’ అమ్మకాల వ్యవహారానికి సంబంధింది పెద్ద రచ్చే జరుగుతోంది.
సోషల్ మీడియా కూడా ఓ వ్యసనం లాంటిదే.!
ఇంటర్నెట్ డేటా దుర్వినియోగం.. తొలుత ఉచితమంటూ ప్రచారం.. ఆ తర్వాత రకరకాల ఛార్జీల పేరుతో జేబులు కొట్టేస్తున్న వైనం.!
సోషల్ కంటెంట్‌కి బానిసలుగా మారిపోవడంతో జీవితాలు కోల్పోతున్న దుస్థితి.!
‘సామాజిక’ మాధ్యం ముసుగులో.. వ్యక్తిత్వ హననం.. సమాజ హననం కూడా.!
ఇదంతా దోపిడీకి అనువైన మార్గం.! ఔను, ఇదొక యాపారం.!
Mudra369
ఒకప్పుడు సెలబ్రిటీలకు మాత్రమే ‘బ్లూ టిక్’ పరిమితమయ్యేది. ఇప్పుడైతై, ఎవరైనా ‘బ్లూ టిక్’ కొనుక్కోవచ్చు.
Social Media Blue Tick.. అసలీ బ్లూ టిక్ ఏంటి.?
సాధారణంగా ఏదన్నా వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తే, అది నిజమా.? కాదా.? అన్న విషయాన్ని దాదాపుగా ‘బ్లూ టిక్’ ద్వారా కన్ఫామ్ చేసుకునే పరిస్థితి వుండేది.
అలాగని, బ్లూ టిక్ వున్న సోషల్ హ్యాండిల్స్‌లో కనిపించేదంతా నిజం కాకపోవచ్చు.! కాకపోతే, కొంత విశ్వసనీయత అనేది ఏడ్చేది. ఇప్పుడలా కాదు.!

డబ్బులు ఖర్చు చేయగలిగితే, బ్లూ టిక్ ఎవరికైనా దక్కతుంది. సో, దుష్ప్రచారాలనండీ.. తప్పుడు వార్తలనండీ.. సోషల్ ఛండాలానికి ఈ ‘బ్లూ టిక్’ అదనపు బలాన్ని ఇస్తుందన్నమాట.
మీడియా.. సోషల్ మీడియా..
మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత ఛండాలంగా తయారైందో అందరికీ తెలిసిందే. దానికి మించి ఛండాలంగా మారింది వెబ్ మీడియా.!
సోషల్ మీడియా సంగతి సరే సరి.! ఇప్పుడీ బ్లూ టిక్ వ్యవహారంతో, మొత్తంగా సోషల్ మీడియాని ‘సెన్సార్’ చేయాలనే డిమాండ్లు షురూ అవుతున్నాయ్.
Also Read: ‘చిత్రం’ చెప్పే కథ.! రాసుకున్నోడికి రాసుకున్నంత.!
పెరుగుట విరుగుట కొరకే.! సామాజిక మాధ్యమ సంస్థలకు ‘బ్లూ టిక్’తో బోల్డంత ఆదాయం వస్తోంది. అదే సమయంలో, సోషల్ మీడియాలో ఛండాలం పెరిగిపోతోంది.!
సోషల్ మీడియా అంటే, దోచుకున్నోడికి దోచుకున్నంత.! అది ట్విట్టర్ కావొచ్చు, ఫేస్‌బుక్ కావొచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావొచ్చు.. మరొకటి కావొచ్చు.!