తన మీద మీడియా అడ్డగోలు ప్రచారానికి దిగిందంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రకుల్ గురించిన ప్రచారం డ్రగ్స్ కేసులో కొంత తగ్గినట్లే కనిపించింది. కానీ, ఆమెకు నోటీసులు జారీ చేయడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమాయత్తమవుతోందంటూ మళ్ళీ ఊహాగానాలు (Soft Targets Shraddha Kapoor Deepika Padukone) మొదలయ్యాయి.
ఈసారి రకుల్‌తోపాటు (Rakul Preet Singh) మరో ఇద్దరు టాప్ హీరోయిన్ల పేర్లను నేషనల్ మీడియా ప్రచారంలోకి తెస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరు శ్రద్ధా కపూర్ కాగా, మరొకరు దీపికా పడుకొనే. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి అరెస్ట్ అయిన విషయం విదితమే.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ (Sara Ali Khan) పేరుని కూడా ఈ కేసులో ప్రస్తావిస్తోంది మీడియా. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ (Karishma Kapoor) పేరుని కూడా డ్రగ్స్ కేసులో లింకప్ చేసేస్తుండడం గమనించదగ్గ అంశం. రియా చక్రవర్తిని (Rhea Chakraborty) అరెస్ట్ చేయడం మినహా ఇంతవరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇంకే ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలకూ కొత్తగా నోటీసులు పంపలేదు.
అయితే, రియా చక్రవర్తి విచారణ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్‌తోపాటు మరికొందరి పేర్లను చెప్పినట్లు నార్కోటిక్స్ బ్యూరో వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఏదిఏమైనా, విచారణ సంస్థలు స్పష్టమైన ప్రకటన ఇచ్చేదాకా ఇందులో ఎవర్నీ నిందితులుగా చేర్చేయలేం. కానీ, మీడియా అత్యుత్సాహం ఆగదు కదా.! అది ఆపగలిగేది కూడా కాదు.
‘అందరికన్నా ముందు’ అనే అత్యుత్సాహం నేపథ్యంలో చాలామంది పేర్లు అకారణంగా ప్రచారంలోకి వచ్చేస్తుంటాయి. ఆయా సందర్భాల్లో సెలబ్రిటీలు, మీడియాపై మండిపడుతున్నా.. వారి దారి వారిదే. ఇదిలా వుంటే, డిప్రెషన్ నేపథ్యంలో కంగనా రనౌత్ డ్రగ్స్‌కి అలవాటు పడినట్లు, స్మోకింగ్‌కి బానిసైనట్లు ఓ బాలీవుడ్ దర్శకుడు పేర్కొనడం గమనార్హం.
ఇదే డిప్రెషన్‌కి బాలీవుడ్‌లో చాలామంది నటీనటులు గురయ్యారు. ఆ డిప్రెషన్ తట్టుకోలేకనే ఎక్కువమంది డ్రగ్స్‌కి బానిసలుగా మారుతుంటారు. తద్వారా మరింత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు కూడా.
కాగా, కన్నడ సినీ పరిశ్రమలో ఇద్దరు హీరోయిన్లు కూడా ఇదే తరహా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ (Sushant Singh Rajput) అనుమానాస్పద మరణం తర్వాత, బాలీవుడ్‌లో డ్రగ్స్ రచ్చ తెరపైకొచ్చింది.