Sonakshi Sinha South Cinema Fate: బాలీవుడ్ షాట్ గన్ శత్రుగన్ సిన్హా కుమారై సోనాక్హి, ‘దబాంగ్’ సినిమాతో తెరంగేట్రం చేసి, తొలి సినిమాతోనే బంపర్ విక్టరీ అందుకుంది.
బాలీవుడ్‌కే పరిమితం కాకుండా దక్షిణాదిలోనూ అవకాశాల కోసం ట్రై చేసిందీ ‘దబంగ్’ బ్యూటీ.!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ‘లింగ’ సినిమాలో నటించింది. కానీ, ఫ్లాప్ మూట కట్టుకుంది. అంతే, సౌత్ సినిమా మళ్లీ ఆమె వైపు చూడలేదు.
నిజానికి ‘లింగ’ సమయంలో సోనాక్షికి (Sonakshi Sinha) సౌత్ నుంచి ఆఫర్లు బాగానే వచ్చాయ్. అయితే, రెమ్యునరేషన్ విషయంలో బాగా ‘టెక్కు’ చేసిందట. లేకపోతే, తెలుగులోనే ఓ నాలుగైదు సినిమాలు చేసేసి వుండేది సోనాక్షి.
Sonakshi Sinha South Cinema Fate.. అప్పుడలా.! ఇప్పుడేమో డీలా.!
తెలుగు సినిమా బాలీవుడ్‌కి గట్టి పోటీ ఇవ్వడం కాదు, యావత్ ఇండియన్ సినిమానే తెలుగు సినిమా శాసిస్తున్న నేపధ్యంలో పాపం సోనాక్షి సిన్హా గతంలో చేసిన తప్పిదాల్ని తలచుకుని, లోలోపల కుమిలిపోతోందట.
‘ఫలానా సినిమాలో ముందుగా నన్నే అడిగారు..’ అంటూ సన్నిహితుల వద్ద ఆయా సినిమాల గురించి చెప్పుకుని వాపోతోందట ఈ బాలీవుడ్ బ్యూటీ.
దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు పెద్దలు. అవకాశాలు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలన్నది సినీ పెద్దల మాట.
Also Read: నయనతార.! ఊ అంటావా.? ఉలిక్కి పడతావా.?
హిందీలోనూ అవకాశాలు తగ్గి, తమిళ, తెలుగు సినిమాలపై ఈ బ్యూటీ స్పెషల్ ఫోకస్ పెట్టిందట.
కుదిరితే హీరోయిన్ రోల్, లేదంటే, హీరోయిన్ ఫ్రెండ్ రోల్, ఇంకా కుదరకపోతే స్పెషల్ సాంగ్ అయినా చేస్తానంటోందట సోనాక్షి.
‘అయ్యో పాపం సోనాక్షి.!’ అంటున్నారట ఆమెని చూసి, గతంలో ఆమెకు అవకాశాలివ్వాలనుకున్న నిర్మాతలు.