Table of Contents
Sonam Kapoor Iconic Fashion Show.. బేబీ బంప్‌ని ప్రమోట్ చేసుకోవడం ఈ మధ్య సెలబ్రిటీలకు నయా ట్రెండ్ అయ్యింది.
ఆ మాటకొస్తే, సెలబ్రిటీలే కాదండోయ్. సెలబ్రిటీయేతరులు కూడా బేబీ బంప్‌తో స్పెషల్ ఫోటో షూట్స్ చేయించేసుకుంటున్నారు. అవే, ప్రీ డెలివరీ ఫోటో షూట్లు అన్నమాట.
సరే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ముచ్చట ఏంటంటే, బాలీవుడ్ అందాల భామ సోనమ్ కపూర్ ప్రెగ్నెన్సీ ముచ్చట. అందులో వింతేముంది. ఆనంద్ ఆహూజా అను బిలీయనీర్‌ని పెళ్లాడిన సోనమ్ కపూర్, ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే కదా అంటారా.?
సోనమ్ కపూర్ ఫ్యాషన్.. తగ్గేదే లే..!
తన బేబీ బంప్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఓ వైపు అమ్మతనాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు సరికొత్త ఫ్యాషన్‌కి తెర లేపుతోంది.
అసలే ఫ్యాషన్ ఐకాన్‌గా చెప్పుకునే సోనమ్ కపూర్, తగ్గేదే లే.. అంటూ ఇప్పుడు కూడా తనదైన స్టైల్లో నయా ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.
మెటర్నిటీ కంఫర్ట్‌లో రకరకాల డిజైనర్ దుస్తులు డిజైన్ చేయించుకుంటోంది. వాటిని ధరించి, స్పెషల్ ఫోటో షూట్లు చేయించుకుంటోంది. రకరకాల రంగుల దుస్తుల్లో సోనమ్ కపూర్ ఫోటో షూట్లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

రెక్కల గౌనులూ, కుచ్చుల గౌనులూ, థీమ్ కాస్ట్యూమ్స్.. ఇలా ఒక్కటేమిటి.. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా తన అందంతో, ఆహార్యంతో అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది అందాల సోనమ్ కపూర్.
Sonam Kapoor Iconic Fashion Show.. సోనమ్ కపూర్ మల్టీ టాలెంటెడ్.!
బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ముద్దులు తనయ అయిన సోనమ్ కపూర్ కేవలం నటి, ఫ్యాషన్ ఐకాన్ మాత్రమే కాదు, మోర్ టాలెంటెడ్.
నటిగా తెరంగేట్రం చేయకముందే, ది గ్రేట్ డైరెక్టర్ అయిన సంజయ్ లీలా భన్సాలీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది.
సంజయ్ తెరకెక్కించిన ‘బ్లాక్’ అనే సినిమాకి సోనమ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది. 2007లో ‘సావరియా’ అను సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ చేసింది.

సల్మాన్ ఖాన్ సరసన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది సోనమ్ కపూర్.
సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర..
బ్రెస్ట్ కాన్సర్ అవగాహనా కార్యక్రమాల్లో సోనమ్ కపూర్ (Sonam Kapoor) విరివిగా పాల్గొటుంది. అలాగే, ఎల్‌జీబీటీ హక్కుల కోసం కూడా తన నినదించింది సోనమ్ కపూర్.
ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని, తనవంతు చైతన్యం అందించడం తనకెంతో ఆనందంగా వుంటుందని చెప్పుకొస్తుంది సోనమ్ కపూర్.
Also Read: నయనతార.! ఊ అంటావా.? ఉలిక్కి పడతావా.?
‘బ్లైండ్’ అను సినిమాలో నటిస్తున్న సోనమ్ కపూర్ (Sonam Kapoor Ahuja), ప్రెగ్నెంట్ కావడం వల్ల సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకుంది.