Sonam Kapoor Fashion Icon.. అసలు ఫ్యాషన్ అంటే ఏంటి.? అని ఇలాంటి ఫొటోల్ని చూసినప్పుడే అనిపిస్తుంటుంది.
కళ్ళు చూపించలేదు.. అసలు ధరించిన డ్రస్సుకి ఏం పేరు పెట్టాలో తెలియడంలేదు. అంగాంగ ప్రదర్శన కోసం అడ్డమైన వెకిలి వేషాలు వేస్తోందనాలా.? ఛాన్సే లేదు.
ఎందుకంటే, అక్కడున్నది ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ (Sonam Kapoor The Fashion Icon Of Indian Cinema).
Sonam Kapoor Fashion Icon.. అనిల్ కపూర్ గారాల పట్టి..
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ నటుడు అనిల్ కపూర్ గారాల పట్టి సోనమ్ కపూర్.
నటిగా హిందీ సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది సోనమ్ కపూర్. నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఓ ఎత్తయితే, అంతకు మించి ఆమెకు మరో గుర్తింపు వుంది.
Also Read: చింపేస్తాం.. పోగులే ధరిస్తాం.. అంతా మా ఇష్టం.!
అదే, ఫ్యాషన్ ఐకాన్. మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి వస్తుంటారు దాదాపుగా హీరోయిన్లంతా.
సో, కళ్ళు చెదిరే ఫ్యాషన్ ఐడియాస్ ద్వారా ఎప్పటికప్పుడు తమ ప్రత్యేకతను చాటుకునే అందాల భామలకు కొదవేం లేదు ఇండియన్ సినిమా విషయంలో.

మళ్ళీ ఇక్కడ అందరిలోకీ చాలా చాలా ప్రత్యేకం సోనమ్ కపూర్. పెళ్ళయ్యాక కూడా సోనమ్ కపూర్ గ్లామర్ అలాగే ఫ్యాషన్ విషయంలో ఏమాత్రం తగ్గలేదు.
ప్యాషన్ అంటే తనకు చాలా చాలా ప్రత్యేకమైన ప్రేమ అనీ, అందరిలోకీ కొత్తగా కనిపించాలనే తపన తనను ప్రతిసారీ కొత్త బాటలో నడిపిస్తుంటుందని సోనమ్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Also Read: Bold Talk – డేటింగుల్లోనూ పొట్టీ.. పొడుగూ.!
ఫ్యాషన్ విషయంలో కొన్నిసార్లు సోనమ్ కపూర్ కూడా విమర్శల్ని ఎదుర్కొంది. అయినాగానీ, సోనమ్ ఎక్కడా తగ్గేది లేదంటుంది.
ఫ్యాషన్ పేరుతో అంగాంగ ప్రదర్శన అవసరమా.? అని ప్రశ్నించేవారికి, ‘అందం చూడవయా.. ఆనందించవయా..’ అంటూ తనదైన స్టయిల్లో సమాధానమిస్తుంటుంది సోనమ్ కపూర్.
