Sonarika Bhadoria Pregnancy Glamour.. చాలామంది చేసేశారు.. ఇకపైనా, చాలామంది చేయబోతున్నారు. ఇందులో వింతేముంది.? ప్చ్.. ఏమీ లేదు.!
సోనారిక.. పేరు తెలుసు కదా.? చేసిన సినిమాల కంటే, సోషల్ మీడియా వేదికగా ప్రదర్శించే గ్లామరతోనే ఈ బ్యూటీకి ఫాలోవర్లు ఎక్కువ.
తెలుగులో రెండు మూడు సినిమాలు చేసింది సోనారిక భడోరియా. హిందీలో చేసిన ఓ టీవీ సిరీస్, సోనారిక భడోరియాకి, బోల్డంత పాపులారిటీ తెచ్చి పెట్టింది.
పార్వతీ దేవిలా ఆ టీవీ సిరీస్‌లో సోనారిక భడోరియా కనిపిస్తుంది. టీవీ సిరీస్‌లో పార్వతీ దేవిగా కనిపించినందుకు వచ్చిన పాపులారిటీ కాదది.

సోషల్ మీడియా వేదికగా, పోస్ట్ చేసిన గ్లామరస్ ఫొటోలతో సోనారిక భడోరియాకి వచ్చిన పాపులారిటీగా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే, పార్వతీ దేవిలా బుల్లితెరపై పవిత్రంగా కనిపించి, ఈ వల్గర్ ఫొటోలు సోషల్ మీడియాలో ఏంటని సోనారికని ట్రోల్ చేయడం ద్వారా, ఆమెకు పాపులారిటీ పెరిగింది.
Sonarika Bhadoria Pregnancy Glamour.. కాదేదీ పబ్లిసిటీి అనర్హం.!
ఎలాగైతేనేం, పాపులారిటీ వచ్చింది కదా.! అలా వచ్చిన పాపులారిటీతో, సోషల్ మీడియాలో మరింత చెలరేగిపోయింది సోనారిక భడోరియా.
అలా చెలరేగిపోవడం వల్లే, సినిమాల్లోనూ.. అందునా, తెలగు సినిమాల్లోనూ సోనారిక భడోరియా ఛాన్సులు కొట్టేయగలిగింది. కానీ, నటిగా సరైన హిట్టు కొట్టలేకపోయిందామె.

కొన్నాళ్ళ క్రితం పెళ్ళి చేసుకుంది సోనారిక. అయినా, గ్లామర్ విషయంలో అస్సలు తగ్గలేదు. చూస్తున్నారు కదా.. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా అస్సలు తగ్గట్లేదు.
మాతృత్వపు మధుర క్షణాలివి.. ప్రతి క్షణమూ ప్రత్యేకం.! శరీరంలో వచ్చే మార్పుల్ని, పదిలంగా పదికాలాలపాటు గుర్తుంచుకోవాలి.. అందుకే, ఇదంతా.. అంటోంది సోనారిక.
Also Read: బిగ్ క్వశ్చన్.! మీ బిర్యానీలో ‘చికెన్’ వుందా.?
అబ్బో, గతంలో చాలామంది చెప్పిందిదే.! ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, సోనారిక కాస్త బెటర్.! గ్లామరస్‌గానే వున్నాయ్ ఈ ఫొటోలన్నీ.
చాలామంది సెలబ్రిటీలు, అత్యంత జుగుప్సాకరంగా ప్రెగ్నెన్సీ ఫొటోల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం చూశాం మరి.!
