వయనాడ్ విలయం: ఈ భూమ్మీద నువ్వెంత.? నీ బతుకెంత.?
Wayanad Disaster.. వయనాడ్ విలయం.! భారీ వర్షాలకు కుదేలవుతోంది.. దేవభూమి.! నిజానికి, కేరళకు వరదలు కొత్త కాదు.! ఆ మాటకొస్తే, భూమ్మీద ఎక్కడైనా వరదలు రావొచ్చు.
వానొస్తే, వరదొస్తుంది.! ఎంత పెద్ద వాన కురిస్తే, అంత పెద్ద వరద వస్తుంది.! ఎడారి దేశాల్లో ఇటీవల కనీ వినీ ఎరుగని రీతిలో వరదల్ని చూస్తున్నాం.
తప్పెక్కడ జరుగుతోంది.? ఇంకెక్కడ, మనతోనే జరుగుతోంది తప్పు.! తప్పు కాదు, పాపం.! మహా పాపం చేస్తున్నాం మనం.!
Wayanad Disaster.. అసలు నువ్వెంత.. నీ బతుకెంత.?
నిజమే కదా.? భూమ్మీదకు అతిథిలా వచ్చాం.. అలాగే పోతాం.! వున్న కాసిని రోజులు, భూమ్మీద దేన్నీ చెడగొట్టకుండా వుండాలి. ఆ తర్వాత పోవాలి.
మనిషి జీవితానికి ఇదే సార్ధకత. కానీ, మనం చేస్తున్నదేంటి.? చెట్లని నరికేస్తున్నాం.. కొండల్ని సైతం మింగేస్తున్నాం. ఇసుక కోసం నదుల్ని తవ్వేస్తున్నాం.
ఇప్పుడు తీరిగ్గా ఏడ్చి ఏం లాభం.? ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు వెచ్చించినా.. పోయిన ప్రాణాల్ని తిరిగి తీసుకురాలేం. అలాగే, ప్రకృతి ప్రకోపాన్ని కూడా తగ్గించలేం. మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ అవుతూనే వుంటుంది.
Mudra369
స్వేచ్ఛగా ప్రవహించే నదుల్ని అడ్డుకుంటున్నాం, ఆనకట్టలు కడుతున్నాం.! ఫలితం, ప్రకృతి ప్రకోపిస్తోంది.. ఆనకట్టలు తెగుతున్నాయ్.. ప్రాణాలు పోతున్నాయ్.
పర్యాటక ప్రాంతాల పేరుతో, అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లోకి రోడ్లు వేసుకుంటూ పోతున్నాం.. ఈ క్రమంలో కొండల్ని అడ్డగోలుగా తవ్వేస్తున్నాం.
ఇలా, భారీ వర్షాలు కురిసినప్పుడు, ల్యాండ్ స్లైడింగ్ జరుగుతోంది. చెప్పుకుంటూ పోతే, కథ చాలా చాలా పెద్దదే. నిజానికి, ఇది కథ కాదు వ్యధ.
ఏది అభివృద్ధి.?
వరదలొస్తే పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో చనిపోతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయ్. ఎక్కడ అభివృద్ధి వుంటే, అక్కడ వరదలు సర్వసాధారణమైపోయాయ్.
ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నయ్, హైద్రాబాద్.. కాదేదీ వరదలకు అనర్హం. మహా నగరాలు ముంపు బారిన పడుతున్నాయ్.. ప్రాణ నష్టమూ సంభవిస్తోంది.
Also Read: బడ్జెట్టు.. మాటల కనికట్టు.! అంతా హాంఫట్టు.!
కోట్లకు పడగలెత్తిన ప్రముఖులు సైతం, వరద ముంపు వేళ, సాయం కోసం ప్రాణ భయంతో ఎదురు చూడాల్సిన పరిస్థితి.
ఎలా.? ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకునేదెలా.? ప్చ్.. పర్యావరణాన్ని పరిరక్షించలేం.. చెయ్యి దాటిపోయింది పరిస్థితి. అనుభవించాల్సిందే. ప్రకృతి ప్రకోపాన్ని భరించాల్సిందే.