Sonu Sood Income Tax.. కరోనా పాండమిక్ నేపథ్యంలో దేశం తల్లడిల్లిపోతున్న వేళ, సోనూ సూద్ చాలామందికి ఆపద్బాంధవుడిగా కనిపించాడు. ఆ దేవుడ్ని ప్రార్థిస్తే కోరిన వరాలు ఇస్తాడో లేదోగానీ, సోనూ సూద్‌కి ఓ చిన్న కోరిక కోరితే చాలు, సాయం అందేస్తుందనే స్థాయిలో.. ఆయన చాలామందికి సాయపడ్డాడు.
నిజమే.. సోనూ సూద్ దేవుడేనని చాలామంది అంటారు. ‘నేను దేవుడ్ని కాదు.. సాధారణ మనిషిని.. మీలో ఒకడ్ని. మీకు సాయం చేసే అవకాశాన్ని నాకు దేవుడు కల్పించాడు. నా తల్లిదండ్రులు నాకు సేవా గుణాన్ని నేర్పారు..’ అని చెప్పేవాడు సోనూ సూద్.
Also Read: Sonu Sood సింపుల్ క్వశ్చన్‌కి సమాధానం చెప్పేదెవరు.?
మరి, సోనూ సూద్ దాదాపు 20 కోట్ల రూపాయల మేర పన్నుల్ని ఎగ్గొట్టినట్లు ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి.? ఆయన మీద ఎందుకు ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది.? సోదాలు నిర్వహించి, ఆయన మీద తీవ్రస్థాయి ఆరోపణలు చేసింది.? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం.
‘నేను భారత పౌరుడ్ని.. ఏం చేసినా, భారత దేశ చట్టాలకు లోబడి చేసిందే.. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. వ్యక్తిగత కారణాల రీత్యా నాలుగైదు రోజులు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాను. ఇకపై నా సేవా కార్యక్రమాలు యధాతథంగా కొనసాగుతాయి..’ అని సోనూ సూద్ ఇచ్చిన వివరణతో దాదాపుగా వివాదాలన్నీ పటాపంచలైనట్టేనన్న భావన ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
Also Read: Sonu Sood.. రాజకీయాల్లోకి మాత్రం రావొద్దు ప్లీజ్.!
దేశంలో చాలామంది రాజకీయ నాయకులున్నారు.. పన్నులు ఎగ్గొడుతున్నవారు అందులో చాలామందే వున్నారు. నల్ల ధనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మన దేశంలో. ఆ నల్ల ధనం ఎందుకు వెలికి తీయడంలేదు.? అన్న ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పరుగాక చెప్పరు.
ఎన్నికలొస్తే, రాజకీయ పార్టీలు వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు చేస్తాయి.. అభ్యర్థులు కూడా పదుల కోట్లు ఖర్చు చేస్తున్నారు. నిజానికి.. అవన్నీ ఆర్థిక నేరాలు. వాటిని వదిలేసి.. సోనూ సూద్ మీద ఆదాయపు పన్నుశాఖ (Sonu Sood Income Tax) ఎందుకు పడినట్టు.? ఇందులో రాజకీయం ఏమై వుంటుంది.?
Also Read: సోనూ సూద్.. రాజువయ్యా.. మహరాజువయ్యా.!