సౌరవ్ గంగూలీ (Sourav Ganguly Biopic To Reveal The Secrets) అలియాస్ రాయల్ బెంగాల్ టైగర్ అలియాస్ దాదా.. క్రికెట్ అభిమానుల దృష్టిలో ఆయన ఎప్పటికీ కింగ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.
ఇండియన్ క్రికెట్ సరికొత్త పంథాలో విజయాల్ని సొంతం చేసుకోవడం ఆరంభించింది సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోనేనని చాలామంది నమ్మతారు. అలాంటి సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కుతోందంటే.. అభిమానులు ఏ స్థాయిలో పండగ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో.
క్రికెట్ అంటే గంగూలీ.. గంగులీ అంటేనే క్రికెట్.. ఒకప్పుడు టీమిండియా అభిమానులు ఇలాగే మాట్లాడేవారు. ఓ వైపు సచిన్ టెండూల్కర్, ఇంకో వైపు సౌరవ్ గంగూలీ.. టీమిండియాని అత్యున్నత శిఖరాలకు అందించారు.
సౌరవ్ గంగూలీ ఫ్రంట్ ఫుట్ వేసి, సిక్సర్ బాదితే.. ఆ షాట్ చాలా చాలా సెక్సీగా వుంటుందంటారు గంగూలీని అభిమానించే మహిళా అభిమానులు కూడా.
దాదా ప్రేమ కథ.!
నిజానికి, గంగూలీ జీవితం తెరచిన పుస్తకం ఏమీ కాదు. సౌరవ్ గంగూలీకి కూడా లవ్ ఎఫైర్ వుంది. ప్రముఖ సినీ నటి నగ్మాతో గంగూలీ ఎఫైర్ గురించి కొత్తగా చెప్పేదేముంది.?
తెలుగు, తమిళ, హిందీ సహా పలు భాషల సినిమాల్లో నటించి, స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది నగ్మా. ఓ దశలో వీరిద్దరూ పెళ్ళి చేసుకోనున్నారనే ప్రచారం జరిగింది. కానీ, గంగూలీకి నగ్మా దూరమయ్యింది. ఎందుకు.? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.
ఇక, క్రికెట్ పోరులో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కుర్రాళ్ళలో పోరాట పటిమ పెంచేందుకు, కెప్టెన్‌గా కొన్నిసార్లు సౌరవ్ గంగూలీ హద్దులు కూడా దాటేశాడు. చొక్కా విప్పేసి.. సంబరాలు చేసుకున్న సందర్భాలూ వున్నాయి. అవేవీ ఆషామాషీ వ్యవహారాలు కావు.
క్రికెట్‌లో వివాదాలకు కొదవేం వుండదు. ఆ వివాదాలకు గంగూలీ కూడా అతీతుడేమీ కాదు. టీమిండియాలో గంగూలీ గ్రూపులు కట్టేశాడన్న విమర్శలున్నాయి. బయోపిక్ సరిగ్గా తీస్తే, ఇదే అత్యంత కీలకమైన ఘట్టమవుతుంది కూడా.
Sourav Ganguly Biopic To Reveal The Secrets నిజాలు చెప్తారా.?
కానీ, బయోపిక్.. అనగానే అందులో వాస్తవాలకంటే కల్పితాలు ఎక్కువగా వుండడం, వివాదాల్ని టచ్ చేయకపోవడం మామూలే గనుక.. గంగూలీ బయోపిక్ నుంచి అద్భుతాల్ని ఆశించలేం.
ఫామ్ కోల్పోవడం, కెప్టెన్సీ వదులుకోవాల్సి రావడం, బీసీసీఐ పగ్గాలు చేపట్టే క్రమంలో జరిగిన సంఘటనలు.. ఇలా చెప్పుకుంటూ పోతే, సౌరవ్ గంగూలీ జీవితంలో చాలా ట్విస్టులే (Sourav Ganguly Biopic To Reveal The Secrets) వుంటాయ్. వాటన్నటినీ బయోపిక్‌లో చిత్తశుద్ధితో టచ్ చేస్తే మాత్రం.. అదొక సంచలనమే అవుతుంది.