Squirrel Attack Andhra Pradesh.. ఓ ఉడత కరెంటు వైరుని కొరికిందట.! కొరికిందో లేదో, కరెంటు వైరుని టచ్ చేయగానే చనిపోయింది పాపం.! పోతూ పోతే, తనతోపాటు ఓ అరడజను మందిని అమాయకుల్ని పైకి తీసుకెళ్ళిపోయింది.
కొన్నాళ్ళ క్రితం ఎలుకలు, వందల లీటర్ల లిక్కర్ తాగేశాయ్.! గుండె పోటు వస్తే, బాత్రూమ్‌లోకి వెళ్ళి, గొడ్డలితో నరుక్కుని చనిపోయాడు ఒకాయన.!
విద్యా వ్యవస్థలో గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొస్తే, వాటి ఫలితంగా ఉత్తీర్ణతా శాతం గణనీయంగా తగ్గిపోయింది.! అబ్బో, చెప్పుకుంటూ పోతే ఆణిముత్యాలు అన్నీ ఇన్నీ కావు.!
ఇవి ఎక్కడ జరిగాయ్.? అనడక్కండి.! మన దేశంలోనే.! ఆ ఘనమైన పాలకులు ఎవరు అనడక్కండి.? మనం ఓట్లేసి గెలిపించినోళ్ళ పుణ్యమే అది కూడా.!
Squirrel Attack Andhra Pradesh ఉడత ఎలా హత్య చేసిందంటే.!
ఉడత ఏంటి.? కరెంటు వైరుని కొరకడమేంటి.? అసలు ప్రపంచంలో ఎక్కడా ఉడతల లేవా.? లేదంటే, ఆ ఉడతలకి, కరెంటు వైర్లతో పనేమీ లేకపోవడం వల్ల, అక్కడ ఇలాంటి ఘటన జరగడంలేదా.?

ఆత్మ హత్య చేసుకోవడానికే ఉండత, కరెంటు స్తంభం ఎక్కి వుంటుంది. లేదంటే, సూసైడ్ బాంబర్‌లా మారి, ఆరుగురు అభాగ్యుల్ని హత్య చేయడానికి, కరెంటు పోల్ మీదకు ఎక్కి.. బీభత్సం సృష్టించినట్టుంది.
నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? అబ్బే, ఇది చాలా చాలా రొటీన్ మాట. ఇలాంటి అద్భుతాలు చాలానే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా.!
అందునా, తెలుగు నేల మీద ఇలాంటి చిత్ర విచిత్రాలు జరుగుతూనే వుంటాయ్. చేసుకున్నోడికి చేసుకున్నంత.. అని ఊరకనే అన్నారా.? డబ్బు తీసుకుని ఓట్లేస్తే, ఇలాంటివే జరుగుతాయ్.!
చెప్పేవాడికి వినేవాడు లోకువ.!
ఉడతలు కూడా, ఆత్మాహుతి దళాల్లా మారిపోయి, మనుషుల్ని చంపేయడమంటే.. ఇంతకన్నా విచిత్రం ఈ భూమ్మీద, ఈ అనంత విశ్వంలో ఇంకేమన్నా వుంటుందా.?
Also Read: మానవ రహిత యుద్ధ విమానం.! ఇది మనదే.!
చివరాఖరికి.. ఉడతకి కూడా పోస్టుమార్టమ్ చేసేశారట అధికారులు.! చెయ్యాలి మరి, ఆ ఉడత మెదడులో పొరుగుదేశం టెర్రరిస్టులేమైనా ‘చిప్’ పెట్టి, మన దేశం మీదకు దండెత్తేలా చేశారేమో.!
ఇదంతా జస్ట్ సరదాకి.! ఎవర్నీ కించపర్చేదానికి కాదు సుమీ.!