Sree Vishnu Single.. శ్రీవిష్ణు హీరోగా ‘సింగిల్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ‘హ్యాష్ ట్యాగ్ సింగిల్’ ఈ సినిమా పూర్తి టైటిల్. నిన్ననే, చిత్ర యూనిట్ ‘ట్రైలర్’ని రిలీజ్ చేసింది.
కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ ‘సింగిల్’ సినిమాలో శ్రీవిష్ణు సరసన. ట్రైలర్ వచ్చింది, సరదా సరదాగా వుందనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.
కానీ, ట్రైలర్ చివర్లో.. మగాడి జీవితం గురించి చెబుతూ, ‘మంచు కురిసిపోవడం’ అంటూ, శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ హాట్ టాపిక్ అయ్యింది.!
Sree Vishnu Single.. మంచు కురిసిపోవడమేంటి.? తప్పు కదా.?
ఎవరికో ఈ ‘మంచు కురిసిపోవడం’పై బాగా కాలిందట. అదీ, సినీ పరిశ్రమలో వున్నవారికేనట. దాంతో, ఆ డైలాగ్ తొలగించాల్సిందిగా, సినిమాపై ఒత్తిడి పెరిగిందట.
నిజానికి, తెలుగు సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు కొత్తేమీ కాదు. ఎప్పటినుంచో నడుస్తున్న వ్యవహారమే ఇది. కమెడియన్లు, హీరోలు, హీరోయిన్లు.. ఒకరేమిటి.? దాదాపు అందరూ వాడేశారు.

అన్నట్టు, సినిమాలో ‘శివయ్యా..’ అని హీరో అనడం మీద కూడా, సదరు సినీ ప్రముఖులు గుస్సా అవుతున్నారట.
అటు ‘శివయ్యా’ అనే ప్రస్తావన మీదా, ఇటు మంచు కురిసిపోవడం మీదా.. ఫిర్యాదులు షురూ అయ్యాట సినీ పరిశ్రమలో.
శ్రీవిష్ణు అంటే అందరివాడు. ఎప్పుడూ వివాదాల్లోకెక్కడు. సో, ఈ విషయాన్ని కూడా సామరస్యంగానే పరిష్కరించుకునే అవకాశముంది.
Also Read: బూతు పచ్చడి.! ‘సోషల్ మీడియా’ దెబ్బకే ఇత్తడైపోయింది.!
అయినా, అంతలా ఏడ్చి చావడానికి ‘శివయ్యా’ అన్న ప్రస్తావనలోగానీ, ‘మంచు కురిసిపోవడం’లోగానీ.. తప్పేముందిట.?
వెనకటికి ‘ఎర్ర కోక కట్టుకున్న ప్రతీదీ నా పెళ్ళామే’ అన్నాడట ఒకడు. అలా వుంది యవ్వారం.!
‘శివయ్యా’ అన్న పదం వాడకూడదా.? ‘మంచు కురిసిపోవడం’ అంటే నేరమా.? ఎందుకు భుజాలు తడుముకోవాలి.?
ఏదిఏమైనా, ‘మంచు కురిసిపోవడం’ అనేది మాత్రం ఓ బూతు ప్రస్తావనకు సంబంధించినదే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
ఆ యాంగిల్‌లో శ్రీవిష్ణు కొంచెం జాగ్రత్త పడి వుండాల్సిందన్నది అతన్ని అభిమానించే మహిళా అభిమానుల అభిప్రాయం.
