Sreeleela Only For Dance.. పెద్దలకి మాత్రమే.. అనే హెచ్చరికల్ని సినీ పోస్టర్లపై గతంలో చూసేవాళ్ళం.! ఆ ప్రస్తావన ఎందుకంటే, శ్రీలీల ఇకపై ‘ఆ టైపు డాన్సుల కోసం మాత్రమే’ అనుకోవాలేమో.!
మొన్నామధ్య ‘జూనియర్’ పేరుతో ఓ సినిమా వచ్చింది. కిరీటి హీరో. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందింది. వచ్చింది, వెళ్ళిపోయింది.
ఇంతకీ, శ్రీలీలని ఆ సినిమాలో హీరోయిన్.. అని అనగలమా.? ప్చ్, పాటల కోసం తప్ప, శ్రీలీలని సినిమాలో పెద్దగా వాడలేదు. ఫస్టాఫ్ ఫర్లేదు, సెకెండాఫ్ మరీ దారుణం.
Sreeleela Only For Dance.. జస్ట్ ఐటమ్ బాంబ్ అంతే..
సెకెండాఫ్‌లో శ్రీలీలని ఓ పాట కోసం, హీరో కలగంటాడు.! అక్కడో మాస్ సాంగ్ కావాలి కాబట్టి.. శ్రీలీలను వున్నపళంగా తీసుకొచ్చేశారు.
ఇలాంటి సాంగ్స్ సాధారణంగా ఐటమ్ బాంబ్స్‌తో తీస్తుంటారు. శ్రీలీలనే ఆ ఐటమ్ బాంబ్ అనే లోటుని కూడా భర్తీ చేసేసింది.

అంతే, ఆ తర్వాత శ్రీలీల మళ్ళీ కనిపించదు ‘జూనియర్’ సినిమాలో. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ‘జూనియర్’ సినిమాలో శ్రీలీల డాన్సులు అదుర్స్.
నిజానికి, శ్రీలీల చాలా మంచి డాన్సర్. అయినాగానీ, ఆమె డాన్సులు కూడా బోర్ కొట్టేస్తున్నాయి క్రమంగా. కొరియోగ్రాఫర్స్ కొత్త స్టెప్పులు ఏమీ డిజైన్ చేయకపోవడం వల్లేనేమో.!
జాగ్రత్త పడుతుందా.?
అయినా, శ్రీలీల కూడా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంది. పరమ రొటీన్ పాత్రలు ఆమెకి పడుతున్నాయి. ‘భగవంత్ కేసరి’ సినిమా ఒక్కటీ, ఆమెకు డిఫరెంట్ రోల్.
నిజానికి, అందులోనూ శ్రీలీల నటిగా చేసిందేమీ లేదు. క్యూట్‌గా వుంటుంది శ్రీలీల ఏ సినిమాలో అయినా. అంతే, అంతకు మించి, నటన పరంగా అస్సలు మాట్లాడుకోకూడదు శ్రీలీల విషయంలో.

అందుకేనేమో, జస్ట్ పాటల కోసమే శ్రీలీలని సినిమాల్లో తీసుకుంటున్నట్టున్నారు. మరోపక్క, ట్రెండ్ మారింది.. హీరోయిన్లు.. పాటలతో అవసరం లేని సినిమాలే ఎక్కువగా వస్తున్నాయ్.
ఫిమేల్ సెంట్రిక్ మూవీ.?
ఫిమేల్ సెంట్రిక్ మూవీస్‌లో శ్రీలీలకి అవకాశాలు రావడం కష్టమే. వచ్చినా, ఆమెని స్క్రీన్ మీద భరించడం కష్టమేనన్న అభిప్రాయం బలపడుతోంది.
Also Read: హృదయ పూర్వం సమీక్ష: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.!
ప్రస్తుతం శ్రీలీల ‘మాస్ జాతర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. రవితేజ హీరో. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘ధమాకా’ సినిమా వచ్చింది. అదో హిట్ సినిమా.
ఇక, పవన్ కళ్యాణ్ సరసన ‘సర్దార్ భగత్ సింగ్’ సినిమాలోనూ శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే.
