Sreeleela Skanda టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా శ్రీలీల పేరు తెగ మార్మోగిపోతోంది. అరడజనుకు పైగా ప్రాజెక్టులు ప్రస్తుతం శ్రీలీల చేతిలో వున్నాయ్.
అందులో రామ్ పోతినేని ‘స్కంధ’ సినిమా ఒకటి. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లు వేగవంతం చేసింది.
తాజాగా ‘నీ చుట్టూ చుట్టూ..’ అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్లు. కొన్ని సెకన్ల పాటు మాత్రమే వున్న ఈ శాంపిల్ వీడియోలో శ్రీలీల వేసిన డాన్స్ స్టెప్‌కి కుర్రకారు దాసోహం అంటోంది.
Sreeleela Skanda రామ్ – శ్రీలీల ఎనర్జీ కె..వ్వు..కేక.!
అసలే ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. ఆ ఎనర్జీని ఎగ్జాట్‌గా మ్యాచ్ చేసేలా శ్రీలీల జోడీ కుదిరింది. ఇంకేముంది.. ఈ సాంగ్ నెక్స్‌ట్ లెవల్‌లో వుండబోతోందనీ అర్ధమైపోతోంది.
ఈ ఒక్క స్టెప్‌తోనే శ్రీలీల ట్రెండింగ్ అయిపోయింది. ఫుల్ లిరికల్ సాంగ్‌ని ఆగస్ట్ 3న రిలీజ్ చేయనున్నారు. ఇక, ఆ వీడియోలో శ్రీలీల దుమ్ము దులిపేసి వుండొచ్చని అంచనా వేస్తున్నారు.
డాన్సుల్లో రామ్ ధిట్ట. ఈ ధీటైన హీరోకి అందమైన డాన్సింగ్ డాళ్ శ్రీలీల డాన్స్ కూడా తోడైతే, అది వేరే లెవల్. కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్‌తో స్టైలిష్ లుక్స్‌తో కనిపిస్తున్నారు ఈ సాంగ్ ప్రోమోలో రామ్, శ్రీలీల.

అంతేనా, శ్రీలీల (Sreeleela) ఈ సాంగ్‌లో ఏకంగా రామ్ పోతినేనిని (Ram Pothineni) డామినేట్ చేసేలా కనిపిస్తోంది.!
బోయపాటి శీను దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ‘స్కంధ’ (Skanda) మూవీ రూపొందుతోంది. ప్యాన్ ఇండియా టార్గెట్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
‘ది వారియర్’ సినిమాతో డిజాస్టర్ చవి చూసిన రామ్‌కి (Ram Pothineni) శ్రీలీల (Sreeleela) లక్కు తోడై ‘స్కంధ’ బ్లాక్ బస్టర్ కానుందేమో చూడాలి మరి.