Sreeleela Social Media Trolling.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి సెలబ్రిటీలు రకరకాలుగా స్పందిస్తుంటారు. కొందరు బాధపడుతుంటారు, కొందరు లైట్ తీసుకోవడం కూడా చూస్తున్నాం.
పలువురు సినీ సెలబ్రిటీలు పోలీసు వ్యవస్థనీ, న్యాయ వ్యవస్థనీ ట్రోలింగ్‌కి వ్యతిరేకంగా ఆశ్రయించడం తెలిసిన విషయమే.
సినిమా, రాజకీయ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఎక్కువగా ట్రోలింగ్‌కి గురవుతుంటారు. సామాన్యులూ ట్రోలింగ్ బాధితులే.!
Sreeleela Social Media Trolling.. మన పని మనం చేసుకు పోవాలి కదా.!
ట్రోలింగ్ విషయమై ‘మాస్ జాతర’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా నటి శ్రీలీల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
‘మనం అందరికీ నచ్చాలనే రూల్ ఏమీ లేదు. కొందరికి నచ్చకపోవచ్చు. వాళ్ళేదో ట్రోలింగ్ చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం..’ అని వ్యాఖ్యానించింది శ్రీలీల.

‘ట్రోలింగ్‌ని పట్టించుకుంటూ పోతే ఎలా.? మనల్ని నమ్మి, సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు కదా.. వాళ్ళకి న్యాయం చేయాలి కదా..’ అని శ్రీలీల చెప్పుకొచ్చింది.
‘నేనైతే, ట్రోలింగ్‌ని పట్టించుకోను..’ అని తేల్చేసింది శ్రీలీల.! ‘టైమ్ పాస్ కోసం ట్రోలింగ్ చేస్తుంటారు..’ అని శ్రీలీల తేల్చి చెప్పింది.
Also Read: విధ్వంసం ఏ స్థాయిలో.? తుపాను హెచ్చరికల్ని ఎలా చూడాలి.?
టైమ్ పాస్ అని కాదుగానీ, అదే పనిగా.. కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తుంటారు. శ్రీలీల విషయంలోనూ ఈ ట్రోలింగ్ ఈ మధ్య ఎక్కువైపోయింది.
విమర్శ వేరు.. ట్రోలింగ్ వేరు.! పెయిడ్ ట్రోలింగ్ కూడా తయారైంది ఈ మధ్య.! సినీ సెలబ్రిటీలు ఎక్కువగా ఈ ట్రోలింగ్ బారిన పడుతున్నారు.
