Table of Contents
Sri Krishna Butter Ball.. రాతి కొండల్ని చూస్తే, పెద్ద పెద్ద బండరాళ్ళు ఎలాంటి ఆధారం లేకుండా, అంతెత్తున ఎలా నిలబడి వున్నాయ్.? అన్న ఆశ్చర్యం కలుగుతుంటుంది.
వేల ఏళ్ళ క్రితం.. కాదు, కాదు.. లక్షల ఏళ్ళ క్రితం భూమి మీద వచ్చిన మార్పులు, ఈ క్రమంలో కొండలు, నదులు, సముద్రాలు.. ఏర్పడ్డాయని పరిశోధకులు చెబుతారు.
ఈ క్రమంలోనే, కొండలపై రాళ్ళ అమరిక కూడా సహజ సిద్ధంగా జరిగిందని చెప్పొచ్చు.
తమిళనాడులోని మామళ్ళాపూర్ (మహాబలిపురం) లో వున్న శ్రీకృష్ణుడి వెన్నముద్ద కూడా అలాంటిదేనా.? అన్న డౌట్ మీకు రావడం సహజమే.
న్యూస్ ఛానళ్ళలోనో, యూ ట్యూబ్ వీడియోల్లోనో.. ఆ వెన్నముద్దని చూస్తేనే, చాలా చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాంటిది, దాని దగ్గరకు వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తేనో.. అదో అద్భుతం.
Sri Krishna Butter Ball.. చెన్నయ్ సమీపంలో.. సముద్ర తీరాన..
చెన్నయ్ నగరానికి కూత వేటు దూరంలో వుంటుంది మామళ్ళపూర్.. అదేనండీ, మహాబళిపురం. ప్రాచీన శిల్పకళాకృతులు ఇక్కడ మనకి స్వాగతం పలుకుతాయి, కొత్త లోకంలోకి తీసుకెళతాయి.
సముద్ర తీరాన వున్న ఈ చిన్న గ్రామంలో, పలు సందర్శనీయ స్థలాలున్నాయి. వాటిల్లో శ్రీకృష్ణుడి వెన్నముద్ద ప్రత్యేకమైనది. మిగతా వాటి గురించి, మరో సందర్భంలో మాట్లాడుకుందాం.

ఓ చిన్న కొండ.. ఆ కొండ మీద ఓ పెద్ద బండరాయి.. దానికి ఎదురుగా నిలబడితే, వచ్చి మీద పడిపోతుందేమోనన్న భయం కలుగుతుంది. అదే శ్రీకృష్ణుడి వెన్న ముద్ద.
వాలుగా వున్న కొండ మీద, ఆ బండ రాయి ఎలా నిలబడగలుగుతోంది.? అన్నది ఓ పెద్ద మిస్టరీ. సందర్శకులైతే ఎలాంటి భయం లేకుండా, బట్టర్ బాల్.. అదేనండీ, వెన్నముద్దని ఆనుకుని ఫొటోలు దిగుతారు.
ఇదీ వెన్న ముద్ద కథ..
ఎండ నుంచి ఉపశమనానికి ఆ బండ చాటున సేదతీరుతారు కూడా. ఆ బండ రాయి కిందకి జారి పడే అవకాశమే లేదని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది.
శ్రీకృష్ణుడు వెన్నదొంగ కదా.. అలా దొంగిలించిన వెన్నముద్దనే ఈ బట్టర్ బాల్.. అని భావిస్తుంటారు. అద్గదీ బట్టర్ బాల్.. అనగా వెన్నముద్ద కథ.
Also Read: మండల మర్డర్స్ రివ్యూ: న్యూక్లియర్ సైంటిస్టు.. మూఢ నమ్మకాలూ.!
వీలైతే, మీరూ మహాబలిపురం వెళ్ళండి.. అక్కడి శ్రీకృష్ణుడి వెన్నముద్దని స్వయంగా చూసి, ఆ ప్రత్యేకమైన అనుభూతిని మీరూ సొంతం చేసుకోండి.
దేశ విదేశాల నుంచి ఈ శ్రీకృష్ణుడి వెన్న ముద్దని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు నిత్యం వస్తూనే వుంటారు.
నామ మాత్రపు రుసుము..
ఈ వెన్నముద్ద సహా, మహాబలిపురంలోని పలు పర్యాటక ప్రాంతాల సందర్శనకు నామమాత్రపు రుసుముని పురావస్తు శాఖ వసూలు చేస్తోంది.
ఈ చారిత్రక ప్రాంతాలన్నీ పురావస్తు శాఖ ఆధీనంలోనే వున్నాయి. చెన్నయ్ నుంచి మహాబలిపురంకి బస్సు సౌకర్యం వుంది.
బస్సు దిగాక, కాసిన్ని అడుగులు వేస్తే చాలు, సందర్శనీయ ప్రాంతాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి.. మనకి ప్రత్యేకమైన అనుభూతినిస్తాయి.
వాటి గురించి ఇంకోసారి ఇక్కడే మాట్లాడుకుందామని ముందే చెప్పుకున్నాం కదా.!