Sriya Reddy OG PSPK.. శ్రియా రెడ్డి తెలుసు కదా.? ఓ మ్యూజిక్ ఛానల్ యాంకర్ ఒకప్పుడు.! ఆ తర్వాత, సినిమాల్లో నటిగా మారింది.
పెళ్ళయ్యాక కొన్నాళ్ళు సినిమాలకు దూరమయ్యిందిగానీ, రీ-ఎంట్రీలో మళ్ళీ జోరు పెంచింది. వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తోంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో సినిమాలపై ఫోకస్ పెట్టింది శ్రియా రెడ్డి.
అప్పుడెప్పుడో, శర్వానంద్ సినిమా ‘అమ్మ చెప్పింది’లో ఓ ఇంట్రెస్టింగ్ రోల్ చేసిన శ్రియా రెడ్డి, త్వరలో ‘ఓజీ’ సినిమాతో థియేటర్లలో సందడి చేయనుంది.
Sriya Reddy OG PSPK.. శ్రియా రెడ్డితో జాగ్రత్త..
శ్రియా రెడ్డి గురించి, ‘ఓజీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘శివంగి’గా అభివర్ణించారు శ్రియా రెడ్డిని పవన్ కళ్యాణ్.

‘ఆమె ఫిట్‌నెస్ లెవల్స్.. అద్భుతం. యాక్టింగ్‌లో ఆమె ఎనర్జీ సూపర్..’ అంటూ పవన్ కళ్యాణ్, శ్రియా రెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అంతేనా, ‘శ్రియా రెడ్డి పవర్ పంచ్ తట్టుకోలేరు. ఆమెతో జాగ్రత్తగా వుండాలి ఎవరైనా..’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇంకో సినిమా..
మనం ఇంకో సినిమా చేద్దాం.. అని పవన్ కళ్యాణ్, శ్రియా రెడ్డిని ఉద్దేశించి చెప్పడంతో, పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొనసాగుతారన్న నమ్మకం అబిమానుల్లో కలిగింది.
Also Read: వెబ్..చారమ్: పాత్రికేయమంటే.! పక్కలెయ్యడమే..నా.?
రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్, గతంలో ఒప్పుకున్న సినిమాలు మాత్రమే చేస్తున్నారిప్పుడు. కొత్తగా ఆయన ఏ సినిమాకీ కమిట్ అయ్యింది లేదు.

‘ఓజీ’ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి రాబోయే సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. అది కూడా గతంలో కమిట్ అయినదే.!
శ్రియా రెడ్డి విషయానికొస్తే, ప్రభాస్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ తెరకెక్కిన ‘సలార్’ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించింది.
