SS Rajamouli RRR Movie: అసలు రాజమౌళికి జక్కన్న అనే పేరెందుకొచ్చింది.? సినిమాని శిల్పం చెక్కినట్టుగా చెక్కుతాడు గనుక. ఎక్కువ సమయం తీసుకుంటాడు రాజమౌళి ఒక్కో సినిమా కోసం. పెర్ఫెక్షన్ కోసమే అలా చేయాల్సి వస్తుందని రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పాడు కూడా.
రాజమౌళి తెరకెక్కించిన చాలా సినిమాలు ‘కాస్ట్ ఫెయిల్యూర్’గా చెప్పేవారు సినీ పరిశ్రమలో ఒకప్పుడు. కానీ, ఎప్పుడైతే మార్కెటింగ్ స్కిల్స్ కూడా షురూ చేశాడో, ఆ తర్వాత రాజమౌళి సినిమా అంటే దానికి పెరిగే క్రేజ్.. వచ్చే వసూళ్ళు ఓ రేంజ్లో వుంటాయ్.
SS Rajamouli RRR Movie.. పాటని కూడా చెక్కేశావా జక్కన్నా.!
సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు..’ అంటే సాగే పాటలో యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఏ రేంజ్లో డాన్సులేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘దుమ్ము’ రేగిపోయిందంతే.!
చరణ్, ఎన్టీయార్.. ఇద్దరూ చాలా మంచి డాన్సర్లు. దాంతో, కొరియోగ్రాఫర్‌కి పెద్దగా కష్టపడాల్సిన పని రాలేదు. స్టెప్పులు ఈజీగానే వేయించేశాడు.
కానీ, రాజమౌళికే నచ్చలేదట. నచ్చకపోవడమంటే, డాన్సుల్లో వంక పెట్టడం కాదు. ఇద్దరి వేగం మ్యాచ్ కాలేదట.. అదీ అసలు సంగతి.
ఎవరెక్కువ.? ఎవరు ఇంకాస్త ఎక్కువ.!
ఒకరు ఎక్కువ వేగం, ఇంకొకరు ఇంకాస్త ఎక్కువ వేగం ప్రదర్శించేసరికి.. సింక్ మిస్సవుతోందంటూ ఏకంగా 17 సార్లు చేయించేశాడట రాజమౌళి.
చివరికి రెండోసారి చేసినదే ఫైనల్ చేశాడు రాజమౌళి.. అంటూ అటు చరణ్, ఇటు ఎన్టీయార్ వ్యాఖ్యానించారు. ‘ఔనంటూ’ రాజమౌళి కూడా ఒప్పుకున్నాడు.
ఇదేదో సినిమా పబ్లిసిటీ కోసం చెబుతున్నారనుకోవాలా.? ఏమో, డౌటే మరి.! ఎందుకంటే, డాన్సుల్లో చరణ్, ఎన్టీయార్‌లను రాజమౌళి క్వశ్చన్ చేయగలడా.? చేస్తాడా.?
Also Read: ప్రకాష్ రాజ్.! జస్ట్ ఆస్కింగ్.. మీరే తిప్పేయొచ్చుగా.?
‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) ప్రమోషన్లలో చరణ్ (Ramcharan), ఎన్టీయార్ (Jr NTR), రాజమౌళి (SS Rajamouli) చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు ఏ సినిమా విషయంలోనూ ఇంత అగ్రెసివ్ ప్రమోషన్స్ కనిపించలేదు.
రామ్‌చరణ్ సహజంగానే కాస్త ‘లో’ మెయిన్‌టెయిన్ చేస్తే, ఎన్టీయార్ మాత్రం పూర్తి ఎనర్జిటిక్‌గా ప్రమోషన్లలో సందడి చేశాడు.