Table of Contents
Tirupati Laddu Prasadam Pavitrata ఓ భక్తుడి ఆవేదన ఇది.! ఔను, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శన భాగ్యమంటే.. అదో మహాద్భుతం.!
వెంకన్న దర్శనం అనంతరం, దేవాలయంలోనే ఓ ఉచిత లడ్డూ ప్రసాదం మన చేతికి దొరుకుతుంది. పూజారి, మనకి ఆ ప్రసాదం ఇస్తారు. భక్తితో ఆరగిస్తాం.
ఆ తర్వాత, లడ్డూ కౌంటర్ దగ్గరకి వెళ్ళి కావాల్సినన్ని లడ్డూల్ని కొనుగోలు చేస్తాం. వాటిని, మనం మాత్రమే తినేయం. మన బంధువులకి పంచి పెడతాం.
Tirupati Laddu Prasadam Pavitrata.. పరమ పవిత్రమైన ప్రసాదాన్ని పంచిపెడతాం..
ఒక లడ్డూని పది మందికో, పాతిక మందికో.. పంచుతాం. ప్రసాదం పంచడాన్ని మహద్భాగ్యంగా భావించే సంస్కృతి మన హిందూ ధర్మంలో వుంటుంది.
మరిప్పుడు, ఆ లడ్డూ ప్రసాదం పేరుతో మనం తిన్నదేంటి.? మనం పంచిందేంటి.? పుణ్యం మూటగట్టుకున్నామా.? పాపం మూటగట్టుకున్నామా.?
తిరుపతి లడ్డూ నాణ్యత విషయంలో చాలాకాలంగా చాలా అనుమానాలున్నాయి. నేను స్వయంగా, తిరుమల తిరుపతి లడ్డూ నాణ్యత విషయమై కలత చెందాను.
కానీ, ఏం చేయలేం.? నాణ్యత తగ్గుతూ వచ్చింది. అదీ, వైసీపీ హయాంలో మరింత దారుణంగా.! ‘దేవుడే అన్నీ చూసుకుంటాడు..’ అని సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఏం పోయేకాలంరా ఇది.?
అయితే, లడ్డూ కోసం వినియోగించాల్సిన నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వుని వినియోగించారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలతో ఒక్కసారిగా గుండె బరువెక్కిపోయింది.
ఒక్క క్షణం గుండె ఆగినంత పనయ్యింది.! నేను తిన్నదేంటి.? నేను పంచిందేంటి.? శనివారం రోజున, కనీసం ‘కేక్’ (ఎగ్‌తో తయారు చేస్తారని) కూడా తినం కదా.! మరి, ఇదేంటి.?
నాలానే, దేశవ్యాప్తంగా హిందువులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువులంతా ఆందోళన చెందారు.
పాప పరిహారమేంటి.? అంటూ, పండితుల వద్దకు పలువురు హిందూ భక్తులు పరిగెత్తడం నా కళ్ళారా నేను చూశాను.! వారం రోజుల ఉపవాసం.. పక్షం రోజులపాటు ప్రత్యేక పూజలు.. ఇలా ఏవేవో చెబుతున్నారు పండితులు.
ఎవరి కక్కుర్తి ఈ వైపరీత్యానికి కారణం.?
ఎవరి కక్కుర్తి వల్ల తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీకి గురయ్యింది.? ఇంతటి పాపానికి ఒడిగట్టిన వాళ్ళకి ఆ వెంకటేశ్వరస్వామి ఎలాంటి శిక్ష వేస్తాడు.?
ఇది నా ఒక్కడి ఆవేదన మాత్రమే కాదు.! కోట్లాది మంది హిందువులు గుండెలు బద్దలు చేసుకుని మరీ సంధిస్తున్న ప్రశ్న. శిక్ష పడాలి.! ఆ దేవుడి శిక్ష కంటే ముందు, హిందూ సమాజం ఒక్కతాటిపైకి రావాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం అయిన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్నే అపవిత్రం చేసిన వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పి తీరాలి.!
చివరగా.. అన్య మతస్తులకి టీటీడీ బోర్డులో చోటుండకూడదు.! కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలోకి అన్య మతస్తుల ప్రవేశాన్ని నిషేధించాలి.
నమో వెంకటేశ.!