SSMB28 Super OTT Deal.. సూపర్ స్టార్ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అంటే.. ఆ రేంజ్ ఎలా వుంటుందో ఊహించుకోవడం అంత ఈజీ కాదు.!
వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సంగతి తర్వాత.. ముందైతే ఓటీటీ డీల్ అదిరిపోయిందంటేనే.. ఇదెంత క్రేజీ ప్రాజెక్ట్ అనేది అర్థమవుతుంది. అదీ మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మీదున్న హైప్ ఎఫెక్ట్
Mudra369
ప్రస్తుతం షూటింగ్ దశలోనే వున్న ఈ సినిమాకి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. ఇది సూపర్ డూపర్ డీల్ అని అంటున్నారు.
SSMB28 Super OTT Deal.. మహేష్ – త్రివిక్రమ్ పవర్ ఇది..
ఏకంగా 80 కోట్ల మేర డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. అంటే, దాదాపుగా హీరో, దర్శకుడు, హీరోయిన్.. ఈ ముగ్గురి రెమ్యునరేషన్లూ కవర్ అయిపోయాయని అనుకోవచ్చేమో.
ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణం సహా అనేక కారణాలతో సినిమా కాస్త ఆలస్యమయ్యింది.
Also Read: హరీష్ శంకర్ హర్టయ్యాడుట.! బుంగ మూతి పెట్టలేదేం.?
ఇప్పుడైతే లాంగ్ షెడ్యూల్ జరుగుతోంది. శరవేగంగా సినిమాని పూర్తి చేయాలనే కసితో వున్నాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
త్రివిక్రమ్‌తో సినిమా పూర్తి చేసి, ఆ తర్వాత రాజమౌళి సినిమాతో బిజీ అవుతాడు మహేష్. రాజమౌళి – మహేష్ కాంబినేషన్లో గ్లోబ్‌ట్రోటింగ్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.