సోహెల్ – మోనాల్ – అఖిల్, అవినాష్ – మోనాల్ – సోహెల్, అబిజీత్ – మోనాల్ – అవినాష్, అవినాష్ – మోనాల్ – అఖిల్, అబిజీత్ – మోనాల్ – అఖిల్.. ఇలా ఇన్ని కాంబినేషన్స్ సెట్ చేసే అవకాశమున్నా, ‘మోనాల్‌ని ఏడిపించిన..’ అంటూ అబిజీత్ – అఖిల్‌లను టాస్క్‌లోకి లాగడమేంటి.? ఇదీ అబిజీత్ (Stop Targeting Abijeet) ప్రశ్న.
నిజానికి, ఇదే టాస్క్‌లో హారికని ‘సెంటర్’ చేసి, కాంబినేషన్లను సెట్ చేయడానికి ఆస్కారం వుంది. అరియానాని కూడా సెంటర్ చేయొచ్చు. కానీ, వీకెండ్‌లో అబిజీత్‌ని అడ్డగోలుగా టార్గెట్ చేసేసి, అబిజీత్ అభిమానుల్ని రెచ్చగొట్టాలనే ఒకే ఒక్క ఉద్దేశ్యంతో చాలా సీరియస్‌గా హోస్ట్ నాగార్జునతో కామెడీ చేయించేసింది బిగ్ బాస్ టీమ్. ఈ సీజన్ మొత్తానికి ఫన్నీయెస్ట్ ఎపిసోడ్‌గా దీన్ని చాలామంది బిగ్‌బాస్ వీక్షకులు అభివర్ణిస్తున్నారు.
Also Read: అబిజీత్‌ని టార్గెట్ చేసిన బిగ్‌బాస్.! ఎందుకిలా.?
అవినాష్ ఏదో సరదాగా నలుగురి ముందు మోనాల్‌తో ఓ మాట అంటే, దానికి మోనాల్ కూడా పగలబడి నవ్వేసింది. అందులో మోనాల్‌ని అబిజీత్ ఏడిపించిందేముంది.? ఆ వీడియో చూపించి, నాగార్జున విరుచుకుపడిపోయాడు అబిజీత్ మీద. కామెడీకే పరాకాష్ట ఇది.
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ని అందరూ పెర్ఫామ్ చెయ్యాలనే ఖచ్చితమైన రూల్ వుంటే, హౌస్‌లో చాలామంది టాస్క్‌లు చెయ్యనే లేదు. టాస్క్ చెయ్యలేదని ఎవర్నీ హోస్ట్ నాగార్జున ఇప్పటిదాకా నిందించిందీ లేదు. పైగా, అబిజీత్ దగ్గర ఖచ్చితమైన కారణం వుంది ఆ టాస్క్ పెర్ఫామ్ చెయ్యకపోవడానికి.
మోనాల్‌ని ఏడిపించేశానని అబిజీత్ ఆ టాస్క్ చేయడం ద్వారా ఒప్పేసుకుంటే, అతని క్యారెక్టర్ దెబ్బతినేస్తుంది కదా.! ‘ఓపెన్ మెయిన్ గేట్..’ అని చెప్పిన నాగార్జున సిల్లీగా అదే గేట్‌ని క్లోజ్ చేయించేశాడు. కానీ, ఈ క్రమంలో అబిజీత్ మోకాళ్ళ మీద నిల్చున్నాడు.
అలా ఓ వ్యక్తి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసే హక్కు బిగ్‌బాస్ టీమ్‌కి ఎవరిచ్చారు.? అంటే, రియాల్టీ షోలోకి వచ్చారు కాబట్టి, ఏం చేసినా పడి వుండాలనే ఆలోచనతో నిర్వాహకులు వున్నారా.? అన్నది అబిజీత్ అభిమానుల ప్రశ్న. ఇప్పటిదాకా నడిచిన ఎపిసోడ్స్ ఓ ఎత్తు, ఈ ఎపిసోడ్ ఒక్కటీ ఇంకో ఎత్తు.
చాలామంది ఛానల్‌ని సింపుల్‌గా స్కిప్ చేసేశారంటే, ఇదెంత సిల్లీ ఎపిసోడ్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ‘వి సపోర్ట్ అబిజీత్’, ‘ఐ యామ్ విత్ అబి’, ‘స్టాప్ టార్గెటింగ్ అబిజీత్’ అని అభిమానులు కోరుతున్నారంటే.. బహుశా దీన్ని ఆశించే బిగ్‌బాస్ ఇంత హైడ్రామా క్రియేట్ చేసి వుంటాడేమో.
అదే గనుక నిజమైతే, ఇంతకన్నా డర్టీ డ్రామా గేమ్ బుల్లితెర చరిత్రలోనే ఇంకోటుండదు. ఒకవేళ అబిజీత్ ఆ టాస్క్ చేసి వుంటే, ఈ వీకెండ్ ఇంకెంత దారుణంగా అబిజీత్‌ని టార్గెట్ చేసేలా డిజైన్ చేసి వుండేవారో. ‘అంటే, నువ్వు క్యారెక్టర్ లాస్ చేసుకుని.. ఆ టాస్క్ ఆడావా.?’ అని ఇదే నాగ్, అబిజీత్‌ని (Stop Targeting Abijeet) ప్రశ్నించి వుండడన్న గ్యారంటీ ఏంటి.?