Nani Dasara RRR Movie.. ఏవండోయ్ నానిగారూ.! ‘శ్యామ్ సింగరాయ్’ తర్వాత ‘అంటే సుందరానికీ’ సినిమా వచ్చిందండోయ్.! ప్చ్.! ‘అంటే సుందరానికీ’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది.!
సరే, సినిమా అన్నాక సక్సెస్సూ.. ఫ్లాపూ మామూలే.! ఆత్మవిశ్వాసం వుండొచ్చు.. కానీ, అతి విశ్వాసం అయితే ఎలా.? ఇలా చాలా కామెంట్లు సోషల్ మీడియాలో పోటెత్తుతున్నాయ్.
నానికి (Natural Star Nani) మద్దతిస్తున్నవాళ్ళు కొందరు.. అదే నానిని దారుణంగా ట్రోల్ చేస్తున్నోళ్ళు ఇంకొందరు. ఎవరి గోల వారిది.
Nani Dasara RRR Movie.. టీజర్ మాత్రం అదిరింది.!
శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ‘దసరా’ సినిమా టీజర్ అదిరిపోయింది.! ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవ్.!
మన తెలుగు సినిమా కదా.! పాన్ ఇండియా రేంజ్‌లో హిట్టయితే అంతకన్నా కావాల్సిందేముంది.? నిజానికి, ‘కాంతారా’ అంత గొప్ప సినిమా ఏమీ కాదు.. కానీ, జాతీయ స్థాయిలో దుమ్ము రేపింది.

సో, నాని సినిమా ‘దసరా’ కూడా జాతీయ స్థాయిలో అదరగొట్టెయ్యాలి. అయితే, నాని ఈ విషయంలో ప్రదర్శిస్తున్న అత్యుత్సాహమే విమర్శలకు తావిస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ స్థాయి వుందా.?
ఏమో, ‘దసరా’ సినిమాలో ఏముందో.? ఇప్పుడే మనం చెప్పలేం. కానీ, నానికి తెలుసు కదా.. సినిమాలో ఎంత స్టఫ్ వుందో.?
గ్లోబల్ సినిమాగా అవతరించిన ‘ఆర్ఆర్ఆర్’తో ‘దసరా’ని పోల్చితే ఎలా.? అఫ్‌కోర్స్.. పోల్చకూడదన్న రూల్ కూడా ఏమీ లేదనుకోండి.. అది వేరే సంగతి.
అన్నట్టు, ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు రాజమౌళికి నాని అంటే చాలా చాలా ఇష్టం. నాని – రాజమౌళి కాంబినేషన్‌లో ‘ఈగ’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: ‘పవిత్ర’ నరేషూ.! ఓ సుపారీ.! నువ్వు కూడానా.?
ఏమో గుర్రం ఎగరావచ్చు.! ‘పుష్ప’ సినిమా గురించి అంతలా ఊహించుకున్నామా.? లేదే.! కానీ, జాతీయ స్థాయిలో అదరగొట్టేసింది కదా.!
ఆ ‘పుష్ప ది రైజ్’ సినిమాతోనే కదా అల్లు అర్జున్ రాత్రికి రాత్రి ‘పాన్ ఇండియా స్టార్’ అయిపోయింది.! ఇంకోసారి ‘పుష్ప ది రూల్’ అంటూ ఇండియన్ బాక్సాఫీస్‌ని శాసించడానికి అల్లు అర్జున్ సిద్ధమవుతున్నాడు.
కాబట్టి, నేచురల్ స్టార్ నాని అతి విశ్వాసాన్ని పక్కన పెడితే.. ‘దసరా’ సినిమా పాన్ ఇండియా హిట్టు కొట్టాలని ఆశిద్దాం. తెలుగు సినిమా నుంచి ఇంకో పాన్ ఇండియా సంచలనం రావాలని కోరుకుందాం.