Sudheer Varma.! అతనో యువ నటుడు. ఒకటి రెండు తెలుగు సినిమాల్లో నటించాడు.! కానీ, ఎంతమందికి గుర్తున్నాడు.?
అతనితో కలిసి నటించిన నటీనటులు, అతనెంత మంచివాడన్నది చెబుతున్నారు.! పోయినోళ్ళంతా మంచోళ్ళే.! అంతేనా.?
కాదట, నిజంగానే చాలామంచోడట. టాలెంటెడ్ నటుడట. మరైతే, సినిమా అవకాశాలెందుకు ఎక్కువగా రాలేదు.?
అప్పట్లో ఉదయ్ కిరణ్..
సినీ రంగంలోకి మెరుపులా దూసుకొచ్చాడు ఉదయ్ కిరణ్ ‘చిత్రం’ సినిమాతో.! బ్యాక్ టు బ్యాక్ హిట్లు.. ఆ తర్వాత ఫెయిల్యూర్లు. చివరికి, బలవన్మరణం.!
ఓ తారను కోల్పోయింది తెలుగు సినీ పరిశ్రమ. యువ నటుడు, బోల్డంత భవిష్యత్ వున్నోడు.. ఉదయ్ కిరణ్ ఎందుకలా చేశాడు.? అది ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీ.
సుధీర్ వర్మకి ఏమైంది.?
యువ నటుడు సుధీర్ వర్మ కూడా బలవన్మరణాన్నే ఎంచుకున్నాడు. ఎందుకు.? అన్నది మాత్రం ఎవరికీ తెలియదు.
కుటుంబ సభ్యులూ ఏమీ చెప్పడంలేదట. సుధీర్ వర్మ అనే నటుడు బలవన్మరణానికి పాల్పడ్డ విషయమూ సినీ పరిశ్రమకి కాస్త ఆలస్యంగా తెలిసింది.
వ్యక్తిగత కారణాలతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడన్నది ప్రాథమిక సమాచారం. కాగా, సినిమా అంటేనే మాయ.! ఎవరు ఎక్కడ ఎలా వుంటారో.. ఏమౌతారో.. ఎవరికెరుక.?
‘కుందనపు బొమ్మ’ అనే సినిమాలో సుధీర్ వర్మ నటించాడు. అతనితో గత కాలపు మధుర జ్ఞాపకాల్ని పంచుకునన్నారు ఆ సినిమాలోనే నటించిన సుధాకర్ కోమాకుల, చాందినీ చౌదరి.!