Sujeeth OG Sequel Prequel.. దర్శకుడు సుజీత్, సూపర్ హిట్ కొట్టాడు.. అనడం కంటే, తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్‌తో ‘లైఫ్ టైమ్ గుర్తుండిపోయే’ సినిమా తెరకెక్కించాడని అనడం కరెక్ట్.!
ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ‘ఓజీ’ సినిమాలో, తన గత చిత్రం ‘సాహో’ నుంచి ఓ సన్నివేశాన్ని యధాతథంగా పెట్టడం. చాలా చిన్న సీన్ అది.
ప్రభాస్ – సుజీత్ కాంబినేషన్‌లో ‘సాహో’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల, ‘సాహో’ అంచనాల్ని అందుకోలేకపోయింది.
Sujeeth OG Sequel Prequel.. ఓజీ తర్వాతేంటి.?
పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబోలో వచ్చిన ‘ఓజీ’ సినిమాకి కొనసాగింపు వుంటుంది. ఈ విషయాన్ని సినిమా చివర్న ‘ఓజీ-2’ అని ప్రస్తావించారు కూడా.
మరోపక్క, ‘ఓజీ’ సినిమాకి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ రాబోతోందన్న ప్రచారం జరుగుతోంది. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. అంటూ, రకరకాల విశ్లేషణలూ కనిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్‌తో ‘ఓజీ-2’ అన్న ప్రచారం సంగతి సరే సరి. అయితే, ఏ ప్రచారాన్నీ సుజీత్ ఇంతవరకూ ఖండించలేదు, సమర్థించలేదు.
సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న సుజీత్..
ఔను, సుజీత్ పట్టరాని ఆనందంలో వున్నాడు. ప్రీ రిలీజ్, సుజీత్ ఎంత కామ్‌గా వున్నాడో, సినిమా థియేటర్లలో అంత సౌండ్ చేస్తోంది.!
సుజీత్ ఎప్పుడూ కామ్‌గానే వుంటాడు. మీడియాని సక్సెస్ మీట్ సందర్భంగా ఫేస్ చేసినప్పుడూ, ఆచి తూచి వ్యవహరించాడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్.
Also Read: ఆ బడ్జెట్టూ.. ఆ వీఎఫ్ఎక్సూ! అందుకే ఈ సక్సెస్సూ!
‘ఓజీ’ నుంచి సీక్వెల్ వస్తుందా.? ప్రీక్వెల్ వస్తుందా.? అన్నది ముందు ముందు తేలుతుంది. కానీ, ‘ఓజీ-2’ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.
‘అకిరానందన్‌లో స్పార్క్ వుంది..’ అంటూ, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు సుజీత్. ఆ కామెంట్స్‌ని ‘ఓజీ-2’కి అన్వయించుకోవచ్చా.?
