Suma Kanakala Cinema Journalists..ప్రెస్ మీట్ అంటే ఏంటి.? దానర్థం ఎప్పుడో మారిపోయింది.! సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లు అనే కాదు, రాజకీయాల్లోనూ ఇలాగే తయారైంది.
బ్రేక్ ఫాస్ట్.. లంచ్.. డిన్నర్.. స్నాక్స్.. వీటిల్లో ఏదో ఒకటి లేకుండా ప్రెస్ మీట్లు కష్టమే.! సినిమా రంగంలో అయితే మరీనూ.!
‘వాళ్ళని బాగా చూసుకుంటే, మన గురించి బాగా రాస్తారు’ అన్న భావన సినీ ఎర్నలిస్టుల విషయంలో సినీ ప్రముఖుల్లో బలంగా నాటుకుపోయింది.
Suma Kanakala Cinema Journalists.. ఎర్నలిజం తప్ప.. జర్నలిజం ఎక్కడుంది.?
నిజానికి, ఇది తప్పేమీ కాదు.! జర్నలిస్టుల్ని ఎవరైనా గౌరవించాల్సిందే. కాకపోతే, జర్నలిజం కాలగర్భంలో కలిసిపోయి చాలా ఏళ్ళవుతోంది. ఇప్పుడున్నదంతా ఎర్నలిజమే.
అలాగని, రాజకీయ నాయకులు అలాగే సినీ ప్రముఖులు ‘సుద్ద పూసలా.?’ అంటే, అదీ కాదు.! దొందూ దొందే.!
ఇక, అసలు విషయానికొస్తే, ప్రముఖ యాంకర్ సుమ, తాజాగా ఓ సినీ ఈవెంట్‌లో, కొందరు మీడియా ప్రతినిథుల్ని ఉద్దేశించి, ‘స్నాక్స్‌ని భోజనంలా తింటున్నారు’ అని కామెంట్ చేశారు.
చాలామంది మీడియా ప్రతినిథులు, ‘ఇది నిజమే కదా..’ అనుకున్నారు. కానీ, కొందరు ఎర్నలిస్టులకి ఎక్కడో కాలింది.!
‘మీడియాని మీరు ఎగ్జంప్ట్ చేయాలి సెటైర్ల విషయంలో’ అనేశారు. ‘సరే, మీరు స్నాక్స్‌ని స్నాక్స్‌లానే తింటున్నారు’ అని ఇంకో కౌంటర్ ఎటాక్ వేసింది సుమ.
పందికొక్కుల్ని ఏకిపారేసిన వైనం..
సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై పెద్ద రచ్చే జరిగింది. మెజార్టీ నెటిజన్లు, ‘పందికొక్కుల్లాంటి ఎర్నలిస్టుల్ని’ ఏకిపారేశారు. కొందరు, సుమని కూడా టార్గెట్ చేశారనుకోండి.. అది వేరే సంగతి.
ఏమయ్యిందోగానీ, సుమ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతూ, ‘మీడియా ప్రతినిథులకు క్షమాపణ’ చెప్పారు.. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారామె.
Also Read: Srinidhi Shetty.. ఈ భామ ఎవరో ‘తెలుసు కదా’.!
ఇదండీ సంగతి.! ఇంతకీ, సినిమా సంబంధిత ఈవెంట్లు (ప్రెస్ మీట్లు, సక్సెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ల వంటివి) జరిగినప్పుడు, ఎర్నలిస్టులు పందికొక్కుల్లా తింటున్నారా.? లేదా.? ఇందులో డౌటేముంది.! కొందరికి అదే పని.!
హీరోయిన్ల పుట్టుమచ్చల గురించీ, పెళ్ళిళ్ళు.. విడాకుల గురించీ.. పనికిమాలిన ప్రశ్నలు వేసేవారు జర్నలిస్టులెలా అవుతారు.? కుక్క కాటుకి చెప్పు దెబ్బ పడాల్సిందే.!