మేఘా.! అదృష్టం ‘ఆకాశ’మంత.! సక్సెస్సో మరి.!

Megha Akash
Megha Akash Sahakutumbanam.. మేఘా ఆకాష్ గుర్తుందా.? గుర్తుండకపోవడమేంటి.. తెలుగులో పలు సినిమాలు చేస్తేనూ.!
నితిన్ (Nithin) హీరోగా తెరకెక్కిన ‘లై’ (LIE) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ ముద్దుగుమ్మ.
ఆ నితిన్‌తోనే ‘ఛల్ మోహనరంగా’ అనే మరో సినిమా కూడా చేసింది.! చెప్పుకోదగ్గ సినిమాలే చేసినా, సరైన సక్సెస్ అంటూ ఈ బ్యూటీ ఖాతాలో పడలేదు.
ఫ్లాపులొస్తున్నా.. ఛాన్సులొస్తున్నాయ్.!
చిత్రమేంటంటే, ఫ్లాపుల మీద ఫ్లాపులొస్తున్నా, అవకాశాలు మాత్రం మేఘా ఆకాష్‌కి వస్తూనే వున్నాయ్.!
ఇంకెవరైనా అయితే, ‘ఐరన్ లెగ్’ అనే ‘ముద్ర’ తప్పించుకోలేకపోయేవారే.! మేఘా ఆకాష్ పరిస్థితి వేరు.!
తెలుగులోనే కాదు, తమిళంలోనూ మేఘా ఆకాష్ పలు సినిమాలు చేసింది, చేస్తూనే వుంది.

మేఘా ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ జరిగింది.
సినిమా టైటిల్ ‘స:కుటుంబానాం’.! టైటిల్ ఇంట్రెస్టింగ్‌గా వుంది కదూ.! అయినా, పేరులో ఏముంది.? సినిమా అంటూ సక్సెస్ అవ్వాలి కదా.!
లక్కు.. కిక్కు.!
మొన్నామధ్య రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రావణాసుర’ సినిమాలోనూ మేఘా ఆకాష్ కనిపించింది. అదేమో నెగెటివ్ షేడ్స్ వున్న రోల్.!
ప్రతిభకి లోటేమీ లేదు.! అందగత్తె.. డాన్సులు బాగా చేయగలదు.. అభినయంలోనూ ఓకే.! అన్నీ వున్నా, అదృష్టమొక్కటీ కలిసి రావట్లేదనుకోవాలి.?
అదృష్టం లేకపోతే అవకాశాలెలా వస్తాయ్.? అదృష్టం కొద్దీ అవకాశాలైతే వస్తున్నాయ్‌గానీ, ఏ అవకాశమూ హిట్టు తెచ్చిపెట్టట్లేదు మేఘా ఆకాష్‌కి.!
