Sundeep Kishan Bhairavakona.. సినీ ఎర్నలిస్టులైపోయారు.. ఇప్పుడిక మీమర్స్ నాన్సెన్స్ షురూ అయ్యింది.! ఇన్‌ఫ్లూయెన్సర్స్.. మీమర్స్.. వీళ్ళతో సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్ జరుగుతున్న రోజులివి.
ఇదేం ట్రెండ్ మహాప్రభో.! ఔను, ఇది నయా ట్రెండ్.! ఇదొక పిచ్చి ట్రెండ్.! ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా.. ఆ తర్వాత వెబ్ మీడియా.. ఇప్పుడేమో సోషల్ మీడియా.!
పేరేదైతేనేం.. సినీ పరిశ్రమ కొత్తదనాన్ని కోరుకుంటోంది పబ్లిసిటీ పరంగా.! ఆ కొత్త కోరిక, సినిమాకి శాపంగా మారుతోంది.
‘ఊరి పేరు భైరవ కోన’ పేరుతో ఓ సినిమా ఇటీవల వచ్చింది. సందీప్ కిషన్ హీరో.! ఈ సినిమాకి సంబంధించి తాజాగా మీమర్స్‌తో ఓ మీట్ ఏర్పాటు చేశారు.
Sundeep Kishan Bhairavakona.. హీరోయిన్ వర్ష బొల్లమ్మకి ఇబ్బందికర పరిస్థితి..
హీరోయిన్ వర్ష బొల్లమ్మ అక్కడే వుంది. అదే వేదికపై హీరో సందీప్ కిషన్ కూడా వున్నాడు. ఓ మీమర్ ఏదో పిచ్చి ప్రశ్న వేశాడు. వర్ష బొల్లమ్మ ఇబ్బందిగా ఫీలయ్యింది.
సందీప్ కిషన్‌కి ఒళ్ళు మండిపోయింది. పదే పదే సదరు మీమర్‌ని వారిస్తూ వచ్చాడు. కానీ, ఆ మీమర్ తగ్గేదే లే.. అంటూ చెలరేగిపోయాడు.

హీరోయిన్‌తో కెమిస్ట్రీ గురించి.. ఏదేదో ఛండాలం వాగేశాడు.. అదీ డబుల్ మీనింగ్ కోణంలో. వద్దు.. వద్దు.. అని సందీప్ కిషన్ ఎంత చెప్పినా విన్లేదు.
కావాలనే చేశారా.?
ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇదంతా కావాలనే చేశారా.? సినిమాకి ఎలాగోలా పబ్లిసిటీ కల్పించుకోవాలని కక్కుర్తి పడ్డారా.?
కొన్నాళ్ళ క్రితం ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో, నటి కలర్స్ స్వాతి చాలా ఇబ్బంది పడింది ఓ సినీ ఎర్నలిస్టు ప్రశ్నకి.
‘డీజే టిల్లు’ సినిమా విషయంలో హీరోయిన్, హీరో.. ఇద్దరూ ఇంకో సినీ ఎర్నలిస్టు వల్ల చికాకు పడాల్సి వచ్చింది.
Also Read: వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్!
మీమర్స్, ఎర్నలిస్ట్స్, ఇన్‌ఫ్లూయెన్సర్స్.. ఎవరైనాగానీ.. వీళ్ళని పిలిచే ముందే, సినీ జనాలు ఒకింత జాగ్రత్త పడాల్సి వుంటుంది. జర్నలిజం వేరు, ఎర్నలిజం వేరు. అది వాళ్ళకీ బాగా తెలుసు.
ఇక్కడ, ఈ ఎపిసోడ్‌లో సందీప్ కిషన్‌ని తప్పు పట్టడానికేం లేదు. కాకపోతే, ఇంకాస్త గట్టిగా చెప్పి వుండాల్సింది. ఆ సన్నాయి నొక్కులు.. ఇంకో బొకడాగాడు రెచ్చిపోవడానికి ఆస్కారం కల్పిస్తాయ్.