Sunny Leone.. కొన్నాళ్ళ క్రితం సన్నీలియోన్ కేరళకు వెళితే, కనుచూపు మేరలో జనసంద్రమే కనిపించింది. అదీ ఆమెకున్న ఫాలోయింగ్.!
రాజకీయాల్లో తరచూ వింటుంటాం, ‘సన్నీలియోన్‌ని చూడటానికి కూడా జనం ఎగబడతారు..’ అనే డైలాగుని. సన్నీలియోన్ అంటే అంత చీపుగా కన్పిస్తుంటుంది రాజకీయ నాయకులకి కూడా.!
ఏం, సన్నీలియోన్‌కి మాత్రం ఎందుకు అభిమానులు వుండకూడదు.? అభిమానులు వుండటమేంటి.? ఓ అభిమాన సంఘమే వుంటేనూ.! ఆ అభిమాన సంఘం, సన్నీలియోన్ పేరుతో సేవా కార్యక్రమాలూ చేసేస్తుంటేనూ.!
కర్నాటకలోని మాండ్యలో ఓ గ్రామంలో ఈ నెల 13న సన్నీలియోన్ పుట్టినరోజు నేపథ్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సన్నీలియోన్ కటౌట్‌కి పూల దండలు కట్టి, నానా హంగామా చేశారు.
అందుకే సన్నీలియోన్ అంటే ఆ అభిమానం.!
బాణా సంచా కాల్చడం, పండ్లు పంచడం.. కొంతమందికి భోజనాలు పెట్టడం.. అబ్బో, పెద్ద కథే నడిచింది. ఈ విషయం మీడియాకెక్కింది. అది కాస్తా సన్నీలియోన్ వరకూ చేసింది.
‘నమ్మలేకపోతున్నా.. మీరు చేసిన పని పట్ల గర్వంగా ఫీలవుతున్నా.. నేను కూడా రక్తదానం చేస్తాను.. థాంక్యూ సోమచ్..’ అంటూ స్పందించింది సన్నీలియోన్.

అయినా, సన్నీలియోన్ పుట్టినరోజు వేడుకల్ని జరపడమేంటి.? అని సదరు అభిమానుల్ని ప్రశ్నిస్తే, ‘ఆమె అనాధల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఓ అనాధను దత్తత తీసుకుంది కూడా..’ అంటూ సమాధానమిస్తున్నారు.
Sunny Leone వెరీ వెరీ స్పెషల్.!
నిజమే, సన్నీలియోన్ ఓ అనాధ బాలికను దత్తత తీసుకుంది. ప్రస్తుతం ఆమె మొత్తం ముగ్గురు పిల్లలు. మిగతా ఇద్దరు ఇద్దరు పిల్లల్ని సరోగసీ మార్గంలో పొందారు.
భారతీయ మూలాలున్న కెనడియన్ మహిళ సన్నీలియోన్. ‘అ..ల్ట్’ వీడియోల్లో నటించి, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది, ఆ తర్వాత ఆ తరహా కంటెంట్‌కి గుడ్ బై చెప్పేసి, బాలీవుడ్‌లో సన్నీలియోన్ నటిగా సెటిలైపోయిన సంగతి తెలిసిందే.
Also Read: అందం నవనీతం.! ఆపై శివంగిలా రాజకీయం.!
కెరీర్ తొలినాళ్ళలో ముంబైలో అద్దెకు వుండేందుకు ఇల్లు దొరకని పరిస్థితి ఎదుర్కొందామె గత చరిత్ర కారణంగా. కొందరు హీరోల భార్యలు, తమ భర్తలకు సన్నీలియోన్‌తో నటించొద్దని వార్నింగ్ ఇచ్చిన ఘటనలూ వున్నాయ్.
కానీ, ఆ తర్వాత సీన్ మారిపోయింది. తెలుగు సహా పలు సౌత్ సినిమాల్లోనూ సన్నీలియోన్ నటించింది, నటిస్తోంది.. బాలీవుడ్‌తో సమానంగా.!