Sunny Leone Saree Sensation.. ఏం సన్నీ లియోన్ చీర కట్టకూడదా.? విదేశాల్లో పుట్టి పెరిగితే మాత్రం, భారతీయ మూలాలు వున్నాయ్ కదా.! అందుకే, చీర కట్టు మీద కాస్తో కూస్తో మోజు ఖచ్చితంగా వుంటుంది.
సరే, ఫక్తు ఫారిన్ బ్యూటీస్ కూడా ఈ మధ్య చీర కట్టులో తమదైన అందాన్ని చూసుకుని మురిసిపోతున్నారనుకోండి.. అది వేరే సంగతి.
తెలుసు కదా.. సన్నీ లియోన్ అంటే, ఒకప్పుడు అడల్ట్ సినిమాల్లో నటించిందని. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో సెటిలైపోయింది.
గతంతో పోల్చితే, జోరు తగ్గినా.. అడపా దడపా ఏదో ఒక సినీ పరిశ్రమలో తళుక్కున మెరుస్తోంది సన్నీలియోన్.

తాజాగా, సన్నీ లియోన్ ఇదిగో.. ఇలా చీర కట్టులో ఫొటోలకు పోజులిచ్చి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, మోడ్రన్ చీర కట్టులో తళుక్కున మెరిసిపోతోంది సన్నీ లియోన్.! అన్నట్టు, చీర కట్టులో కనిపించడం అంటే భలే ఇష్టమట సన్నీ లియోన్‌కి.
కానీ, ఎక్కువగా మోడ్రన్ దుస్తులు ధరించడం అలవాటైపోయిందనీ, అప్పుడప్పుడూ చీర కట్టులో కనిపించి, ముచ్చట తీర్చుకుంటానని సన్నీ లియోన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
అన్నట్టు, సన్నీ లియోన్ తెలుగులోనూ కొన్ని సినమాలు చేసిన సంగతి తెలిసిందే. వాటిల్లో చాలావరకు వ్యాంప్ తరహా పాత్రలేననుకోండి.. అది వేరే సంగతి.
