Suresh Kondeti Tollywood Ban.. సురేష్ కొండేటి.. ఈ పేరు తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ సుపరిచితమే.! ఓ దిన పత్రిలో సినిమా రిపోర్టర్ స్థాయి నుంచి సొంతంగా సినిమా పత్రికను స్థాపించే స్థాయికి ఎదిగాడాయన.!
అంతే కాదు, నటుడిగానూ ఒకటీ అరా సినిమాల్లో నటించాడు. సినీ నిర్మాతగానూ పలు సినిమాల్ని నిర్మించాడు సురేష్ కొండేటి.!
కొన్నాళ్ళ క్రితం ‘డీజే టిల్లు’ సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా, హీరోయిన్ నేహా శెట్టి పుట్టుమచ్చల గురించి, హీరోని ప్రశ్నించి సురేష్ కొండేటి వివాదాల్లోకెక్కాడు.!
Suresh Kondeti Tollywood Ban.. అందరూ పత్తిత్తులే.!
సురేష్ కొండేటి మాత్రమేనా.? మూర్తి అని ఇంకో జర్నలిస్టున్నాడు.! సినీ నటి ‘కలర్స్’ స్వాతి వైవాహిక జీవితం, విడాకుల గురించి ప్రశ్నించి వివాదాల్లోకెక్కాడు.!
ఇంకో సినీ జర్నలిస్టు, ‘స్నాక్స్’ వివాదంలో చిక్కుకున్నాడు. అసలు సినిమాకి సంబంధించి జర్నలిజం ఎక్కడుంది.? అంతా ఎర్నలిజమే కదా.?
గాలి వార్తలు పోగెయ్యడం, అత్యంత జుగుప్సాకరమైన గాసిప్స్‌తో పాపులారిటీ సంపాదించుకోవడం.. ఇదే సినీ జర్నలిజమంటే.! ఆ స్థాయికి సినిమా పాత్రికేయాన్ని దిగజార్చేశారు అందరూ కలిసి.
బ్యాన్ ఎలా చేస్తారు.?
ఓ ఈవెంట్ నిర్వహణ విషయంలో సురేష్ కొండేటి తడబడ్డాడు. కొన్నేళ్ళుగా అలాంటి ఈవెంట్స్ అత్యద్భుతంగా నిర్వహించిన సురేష్ కొండేటి, ఈసారి మాత్రం ఇబ్బంది పడ్డాడు.
ఈ క్రమంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో, సురేష్ కొండేటి అందరికీ టార్గెట్ అయిపోయాడు. అంతే, సినిమా జర్నలిస్టులంతా కలిసి ఆయన్ని బ్యాన్ చేసేశారట.
‘బ్యాన్’ వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడంతో, డివోషనల్ టూర్‌లో వున్న సురేష్ కొండేటి వివరణ ఇచ్చాడు.. తనను బ్యాన్ చేసేంత సీన్ ఎవరికీ లేదనీ తేల్చి చెప్పేశాడు.
అసలంటూ బ్యాన్ చేయాల్సి వస్తే, సినీ జర్నలిస్టుల్లో ఒక్కడైనా మిగులుతాడా.? అన్న చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
Also Read: జూనియర్ ఎన్టీయార్‌కి ఓటేసిన ‘యానిమల్’ భామ.!
చాలాకాలంగా సురేష్ కొండేటిని తొక్కెయ్యడానికి ‘గోతికాడి నక్కల్లా’ ఎదురు చూస్తున్న కొందరు ‘పత్తిత్తు’లు చూపిన అత్యుత్సాహమే, ఈ బ్యాన్ హంగామా.!
ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే, సురేష్ కొండేటి దగ్గర ‘చెంచాగాళ్ళలా’ బతికినోళ్ళూ, ఆయనకి వ్యతిరేకంగా ‘బ్యాన్’ అంశాన్ని తెరపైకి తెచ్చారనే ప్రచారం జరుగుతుండడం.