Sushant Singh Rajput RIP దివ్య భారతి ఎలా చనిపోయింది.? ఉదయ్ కిరణ్ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.? సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి కారణమెవరు.? ఇవన్నీ మిలియన్ డాలర్ క్వశ్చన్స్.!
చరిత్రలోకి తొంగి చూస్తే, అర్థాంతరంగా ముగిసిపోయిన చాలా మంది సినీ ప్రముఖుల జీవితాలు మనకి కనిపిస్తాయి.. మన కళ్ళు చెమర్చేలా చేస్తాయ్.!
స్టార్ హీరో అవ్వాల్సినోడు.. అవుతున్నోడు.. అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty) వల్లనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.. కాదు కాదు, ఆమే చంపేసిందని కూడా ప్రచారం చేశారు.
Sushant Singh Rajput RIP ఎందుకు.? ఎలా చనిపోయాడు.?
ఏది నిజం.? చనిపోయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి మాత్రమే తెలుసు. ఆయనెలాగూ బతికొచ్చి, తన మరణం వెనుక మిస్టరీ ఇదీ.. అని చెప్పడు.
ఒకవేళ సుశాంత్‌ది హత్యే అయితే, దానికి కారణమైనవాళ్ళు, దాని గురించి తెలిసినవాళ్ళూ ఎట్టి పరిస్థితుల్లోనూ పెదవి విప్పరు.

నిజానికి, ఇదేమీ ఛేదించలేనంత గొప్ప మిస్టరీ కాదు. కానీ, ఛేదించబడదు. ఎందుకంటే, సినీ పరిశ్రమలో ఇదొక్కటే ఇలాంటి కేసు కాదు. ఇలాంటివి చాలానే వున్నాయ్. ఏ కేసులోనూ నిజాలు బయటకు రావు. ఎందుకు.? అంటే, అదంతే.!
సుశాంత్ అనుమానాస్పద మరణం.. చాలా రోజులపాటు వార్తల్లో హాట్ టాపిక్. రోజులు, నెలలు గడిచేసరికి క్రమక్రమంగా వ్యవహారం సద్దుమణుగుతూ వచ్చింది.
కడిగి తీరాల్సిందే.! కానీ, ఎలా.?
తొలి వర్ధంతికి ముందు మళ్ళీ హడావిడి మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు అది చల్లారిపోయింది. మళ్ళీ రెండో వర్ధంతికి ముందు హంగామా షురూ అయ్యింది.. రేపో మాపో మళ్ళీ జనం ఈ విషయాన్ని మర్చిపోతారు.!
అక్కడ పోయింది ఓ ప్రాణం. ప్రాణం ఎంత విలువైనదో గంటల కొద్దీ, రోజుల తరబడి లెక్చర్లు దంచేస్తుంటాం. ఒక ప్రాణం ఎందుకు, ఎలా పోయిందో మాత్రం నిజాలు నిగ్గు తేల్చలేకపోతున్నాం.
Also Read: నయనతార పెళ్ళయిపోయింది.! తర్వాతేంటి.?
నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గు లేని సమాజాన్ని.. అగ్గితోటి కడుగు.. ఈ సమాజ జీవచ్ఛవాన్ని.. అన్నాడో సినీ కవి. కానీ, అలా అడిగేటోడెవరు.? కడిగేటోడెవరు.?