Swara Bhasker Chaava.. బాలీవుడ్ నటి స్వర భాస్కర్(Swara Bhasker) గురించి తెలుసు కదా.! వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వార్తల్లోకెక్కడం.! ఇదీ ఆమె పద్ధతి.!
సినీ రంగంలో ఆమె వేసిన ‘వంకర’ వేషాల కారణంగా, సినిమాల్లో అవకాశాల్లేకుండా పోయాయ్.! తరచూ రాజకీయ వివాదాల్లోనూ జోక్యం చేసుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.
వాక్ స్వాతంత్రం.. అంటూ, నోటికొచ్చింది వాగడం స్వర భాస్కర్‌కి అలవాటే.! ఈ వంకర స్వరం తాజాగా, ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ బయోపిక్ మీదకు మళ్ళింది.

Swara Bhasker Chaava.. చిన్న మెదడు చితికిపోయిందా.?
‘చావా’ పేరుతో ఇటీవల విడుదలైన సినిమాలో అన్నీ కల్పితాలేనని, కట్టుకథలతో దుష్ప్రచారం చేస్తున్నారనీ, సెంటిమెంట్లతో ఆడుకుంటున్నారనీ స్వర భాస్కర్(Swara Bhasker) ఆరోపించేసింది.
అసలు విషయమేంటంటే, హిందూ సమాజం ఛత్రపతి శివాజీ గురించి మరింత గట్టిగా మాట్లాడుతోంది. శంభాజీ జీవితం గురించి ‘చావా’ సినిమా ద్వారా తెలియజేసినందుకు చిత్ర యూనిట్‌ని అభినందిస్తోంది.
ఇదే స్వర భాస్కర్‌కి(Swara Bhasker) అస్సలు నచ్చడంలేదు.! ఎందుకంటే, అందులో శంభాజీ పోరాడింది దేశంపైకి దండెత్తి వచ్చిన మొఘలులపైన. మొఘలులంటే తెలుసు కదా, ముస్లిం రాజులు.
సెక్యులరిజం మాటున ద్వేషం..
అద్గదీ అసలు విషయం.! ఈ దేశంలో సెక్యులరిజం అంటే, హిందూ మతంపై దుష్ప్రచారం చేయడం.! మెజార్టీని అనగదొక్కి, మైనార్టీని భుజానికెత్తుకోవడమే సోకాల్డ్ సెక్యులరిజం.
ఆ తరహా సెక్యులరిజంలో బతికేస్తున్న కొందరు ‘చిన్న మెదడు’ సెలబ్రిటీల్లో స్వర భాస్కర్ కూడా ఒకరు.! నిజానికి, ఇదొక మానసిక సమస్య.! ఇదొక మానసిక రోగం.. అని కూడా అంటుంటారు.
Also read: బాలయ్యతో సంయుక్త.! ‘అఖండ-2’లో ఆమె పాత్ర ఏంటి.?
తన వాదన నిజం.. అని చెప్పేందుకు, హిందూ చక్రవర్తులకు వ్యతిరేకంగా వున్నవీ లేనివీ పోగేస్తోంది సోషల్ మీడియాలో. రాజకీయంగా ఓ పార్టీతో విభేదిస్తే, తప్పు కాదు.!
కానీ, ఓ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా నినదించడమంటే, ఓ మతానికి వ్యతిరేకంగా వ్యవహరించాలన్న కుట్రపూరిత వైఖరి క్షమార్హం కాదు.