Tamannaah Bhatia About Marriage.. ఇంతకీ, తమన్నా భాటియా పెళ్ళెప్పుడు.? గత కొంతకాలంగా తరచూ వినిపిస్తోన్న ప్రశ్న ఇది. ఆమె మీదకి నేరుగా మీడియా చాలా సార్లు ఈ ప్రశ్నాస్త్రాన్ని సంధించింది.
ఒకప్పుడు, సినిమా హీరోయిన్లు.. పాతికేళ్ళకే పెళ్ళి చేసేసుకునేవారు. చాలా అరుదుగా మాత్రమే, వయసు మీద పడినా పెళ్ళీ గిల్లీ అనే ఆలోచన లేకుండా కొందరు వుంటుంటారు.
పెళ్ళి ప్రస్తావన లేని హీరోయిన్లు.. అంటే, ఒకప్పుడు రేఖ.. ఆ తర్వాత టబు.. ఇలా కొందరున్నార్లెండి.!
ఇంతకీ, తమన్నా ఏ కేటగిరీకి చెందుతుంది.? అయినా, తమన్నాకి ఏమంత వయసయిపోయిందని.?
Tamannaah Bhatia About Marriage.. విజయ్ వర్మతో ప్రేమాయణం..
తాజాగా తమన్నా భాటికా, తన కో-స్టార్ విజయ్ వర్మతో ప్రేమలో పడింది. ఇద్దరూ సహజీవనంలో బిజీగా వున్నారు.
విజయ్ వర్మతో పెళ్ళెప్పుడు.? అన్న ప్రశ్న తాజాగా తమన్నా ముందుకు వచ్చింది. ‘నా తల్లిదండ్రులే నన్ను ఈ ప్రశ్న అడగలేదు’ అంటూ అసహనం వ్యక్తం చేసింది తమన్నా.!
పెళ్ళెప్పుడన్నదానిపై స్పష్టత లేదుగానీ, ప్రస్తుతానికైతే విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది.

అందాల భామలు ప్రేమలో పడటం, సింపుల్‌గా ‘బ్రేకప్’ అనేయడం కొత్తేమీ కాదు. సినీ పరిశ్రమలో ఇది సర్వసాధారణమైన విషయం. హీరోలూ తక్కువేం కాదు.
అయితే, అందరూ అలానే వుండాలన్న రూలూ లేదనుకోండి.. అది వేరే సంగతి. అయినా, పెళ్ళెప్పుడు.? అని ప్రశ్నిస్తే, ‘సమయం వచ్చినప్పుడు చెబుతా..’ అనాలిగానీ, ‘మా అమ్మా నాన్న కూడా ఇలా అడగలేదు’ అని రుసరుసలాడటమేంటో.!
అన్నట్టు, తమన్నా ఇటీవల ‘జైలర్’ సినిమాలో కనిపించింది. ఆ సినిమా పెద్ద హిట్. తెలుగులో ‘భోళా శంకర్’లో నటించింది.. అది కాస్తా డిజాస్టర్ అయ్యింది.
చచ్చేది ఒక్కసారే.! ఎవరికైనా తప్పదది.!
పుట్టిన మనిషి చావాల్సిందే.! ఏ జీవికి అయినా మరణం తప్పదు.! అందరికీ తెలిసిన విషయమే ఇది.! కానీ, ‘చావు’ వార్తలకి వున్న గిరాకీ అంతా ఇంతా కాదు.!
Also Read: 100 మందికి.. కోటి రూపాయల సాయం.! బంగారు కొండే.!
మీడియా పర్సనాలిటీస్ కూడా చావుకి అతీతం ఏమీ కాదు కదా.! అలాంటప్పుడు, చావు వార్తల విషయంలో ఎందుకు సంయమనం పాటించరు.?
ఇది కలికాలం.! అంతకు మించి, సోషల్ మీడియా కాలం.! దీన్ని పోయేకాలం అని కూడా అనొచ్చు.!