Tamannaah Bhatia Baahubali.. ఔను కదా.! ‘బాహుబలి’ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటించింది కదా.! ఆ విషయం ఎవరికీ గుర్తు లేదా.?
ఎందుకు గుర్తు లేదూ.! ప్రభాస్ (Prabhas) – తమన్నాల (Tamannaah Bhatia) మధ్య వచ్చే ‘పచ్చబొట్టు..’ సాంగ్ అప్పట్లో వైరల్ అయ్యింది.! అదో క్లాసిక్ సాంగ్ అనుకోవచ్చు కూడా.!
ఇప్పటికీ, ఆ సాంగ్ యూ ట్యూబ్‌లో వ్యూస్ కొల్లగొడుతూనే వుంది. అంతే కాదు, ‘బాహుబలి’ (Baahubali) కోసం తమన్నా చేసిన కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆమెకు బాగానే గుర్తింపు తెచ్చిపెట్టాయ్.!
క్యాష్ చేసుకోలేకపోయిందట పాపం..
‘బాహుబలి’ (Baahubali The Begining) సినిమాలోని తన పాత్రకు సరైన గుర్తింపు దక్కలేదనీ అతిథి పాత్రగానే అందరూ ఆ పాత్రని చూశారనీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాపోయింది తమన్నా.

ప్రభాస్, రానా దగ్గుబాటి ‘బాహుబలి’ కోసం చాలా చాలా కష్టపడ్డారనీ, ఆ సినిమాకి సంబంధించి ఆ ఇద్దరూ అందుకున్న ప్రశంసలు ప్రత్యేకమైనవనీ, ఆ ప్రశంసలకు వారు అర్హులనీ తమన్నా చెప్పుకొచ్చింది.
అయినా, ‘బాహుబలి’ని (Baahubali The Begining.. Baahubali The Conclusion) క్యాష్ చేసుకోలేకపోయానని తమన్నా ఎందుకు చెప్పిందబ్బా.?
Tamannaah Bhatia Baahubali.. బాగానే క్యాష్ చేసుకుందిగా.!
‘పచ్చబొట్టు..’ సాంగ్‌తో తమన్నా (Tamannaah Bhatia) పేరు మార్మోగిపోయింది. ఆ పాట ఆమెకు బోల్డంత స్టార్‌డమ్ సరికొత్తగా తెచ్చిపెట్టింది కూడా.! ‘ధీవర’ సాంగ్ కూడా అంతే.!
అయినా, ‘బాహుబలి’ సక్సెస్‌ని క్యాష్ చేసుకోలేకపోయానని తమన్నా చెప్పిందంటే.. ఆమె ఇంకెంతలా క్యాష్ చేసుకోవాలని ఆరాటపడిందో ఏమో.!
Also Read: పూజా హెగ్దే ఔట్.! మృనాల్ ఠాకూర్ ఇన్.! ఎందుకంట.?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘బాహుబలి’ (Baahubali The Conclusion) ప్రస్తావన వస్తే, ఇదిగో ఇలా.. ‘క్యాష్ చేసుకోలేకపోయా’ అంటూ వాపోయింది మిల్కీ బ్యూటీ తమన్నా.
నిజానికి, మెయిన్ హీరోయిన్ అనుష్క శెట్టితో సమానంగా దర్శకుడు రాజమౌళి, తమన్నాకి ప్రాధాన్యతనిచ్చాడని అనుకోవచ్చు.
కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, తమన్నాతో (Tamannaah Bhatia) యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేయించేశాడు జక్కన్న ‘బాహుబలి’ కోసం.
అయినా తమన్నా.. ఇప్పుడెందుకు పాత పంచాయితీ గురించి మాట్లాడుతోంది.? ప్రభాస్ ‘ఆదిపురుష్’ రిలీజ్ నేపథ్యంలో.. తన వ్యాఖ్యలకు హైప్ వస్తుందనేమో.!