Tamannaah Bhatia.. మిల్కీ బ్యూటీ తమన్నా ఫ్యాషన్ ఐకాన్.! ఇది అందరికీ తెలిసిన విషయమే.
జుగుప్సాకరమైన కాస్ట్యూమ్స్ దగ్గర్నుంచి, అత్యద్భుతమైన కాస్ట్యూమ్స్ వరకూ.. తమన్నా చూడని ఫ్యాషన్ అంటూ లేదనడం అతిశయోక్తి కాదు.
ఎప్పటికప్పుడు ట్రెండీ గెటప్‌లో కనిపించడం తమన్నా స్పెషాలిటీ. అదేంటో, వయసు పెరుగుతున్నకొద్దీ తమన్నాలో గ్లామర్ కూడా పెరుగుతూ వస్తోంది.
Tamannaah Bhatia.. ఈసారి ఎరుపెక్కించింది..
రెడ్ కలర్ తమన్నాకి ఫేవరెట్.! ఆ మాటకొస్తే, ఏ డార్క్ కలర్ డ్రస్ అయినాగానీ, ఆమె మిల్కీ టోన్ స్కిన్ కారణంగా మరింత ఎలివేట్ అవుతుంటుంది.

ఎరుపు రంగు కాస్ట్యూమ్స్‌లో తమన్నా మరింతగా మెరిసిపోతోంది. కానీ, ఈసారి ఆ ఎరుపు రంగు డ్రెస్ ట్రోలింగ్‌కి కారణమయ్యింది.
అసలు ఇది డ్రెస్సేనా.? అంటూ నెటిజన్లు తమన్నాని ఏకి పారేస్తున్నారు. అఫ్‌కోర్స్.. వాటిని ఆమె లెక్క చేయదనుకోండి.. అది వేరే సంగతి.
ప్రేమ కథ సంగతేంటి.?
నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్‌లో వుందనీ, ఇద్దరూ పెళ్ళి పీటలెక్కబోతున్నారనీ ప్రచారం జరుగుతోంది.
అయితే, తమన్నా ఇంతవరకు ఈ గాసిప్స్‌ని ఖండించలేదు. విజయ్ వర్మ మాత్రం, ఓ సెటైరేశాడు మీడియా మీద.. అవన్నీ గాసిప్స్.. అని చెప్పే క్రమంలో.
Also Read: ప్రణీత.! చాలాకాలం తర్వాత.! ఏంటి కథ.?
విజయ్ వర్మ అంటే నాని హీరోగా వచ్చిన ‘ఎంసీఏ’ సినిమాలో విలన్. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నాడీ టాలెంటెడ్ నటుడు.