తమన్నా (Tamannaah Bhatia) అంటేనే, తళుకు బెలుకులకు కేరాఫ్ అడ్రస్.! అందాల ఆరబోత విషయంలో తమన్నా తర్వాతే ఎవరైనా.!
చాలా చాలా అరుదుగా మాత్రమే తమన్నా డీ-గ్లామర్ లుక్‌లో కనిపిస్తుంటుంది.. సినిమాల్లో.! అలాగని, నటిగా తమన్నా స్కోర్ చేయలేదని కాదు, నటిగా తనను తాను ఎప్పుడో ప్రూవ్ చేసుకుంది మిల్కీ బ్యూటీ.
ఈ మధ్యనే ‘బబ్లీ బౌన్సర్’ సినిమాలో నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది తమన్నా భాటియా.!
Tamannaah Bhatia ఈ తళుకుల సంగతేంటి.?
ట్రెడిషనల్ వేర్ అయినా, మోడ్రన్ వేర్‌లో అయినా.. తమన్నా ‘తళుకుల షో’ మాత్రం ఓ రేంజ్‌లో వుంటుంది. దటీజ్ తమన్నా.!

తాజాగా, తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వావ్, చీరకట్టులోనూ ఇంత హాట్ అప్పీల్ వుంటుందా.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
గ్లామర్ ప్లస్ పర్ఫామెన్స్..
కెరీర్‌లో చాలా ఎత్తుపల్లాలు చవిచూసిన తమన్నా (Tamannaah), తన సుదీర్ఘమైన సినిమా కెరీర్‌లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానంటోంది.
Also Read: అద్దె గర్భం.! నయనతారపైనే ఎందుకింత దుమారం.?
ఫిట్‌గా వుండటం.. ఆనందంగా వుండడం.. ఇవే అందాన్ని పెంచుతాయంటోన్న తమన్నా, కథల ఎంపికలో మునుపటితో పోల్చితే ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెబుతోంది.
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ.. ఇలా పలు భాషల్లో తమన్నా సినిమాలు చేసింది, చేస్తూనే వుంది.!