Tamannaah Bhatia Webseries కైరా అద్వానీ.! ఈ పేరు చెప్పగానే, ‘భరత్ అనే నేను’ అనే సూపర్ హిట్ సినిమా గుర్తుకు రావడం సహజమే. కానీ, అంతకన్నా ముందు ‘లస్ట్ స్టోరీస్’ గుర్తుకొస్తుంటుంది.
దేశాన్ని ఓ ఊపు ఊపేసిన వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’. అందులో కైరా అద్వానీ చేసిన రోల్, ఆ రోల్‌లో ఆమె పండించిన ఎక్స్‌ప్రెషన్స్.. ఓ సంచలనం అంతే.!
ఆ ‘లస్ట్ స్టోరీస్’కి సీక్వెల్ రాబోతోంది. ఈసారి సెంటరాఫ్ ఎట్రాక్షన్ ఎవరో తెలుసా.? ఇంకెవరు, మిల్కీ బ్యూటీ తమన్నా.!
Tamannaah Bhatia Webseries కైరా అద్వానీని తమన్నా మరిపిస్తుందా.?
‘లస్ట్ స్టోరీస్’ సీక్వెల్ కోసం తమన్నా భాటియా ఓ రేంజ్‌లో హాట్ అప్పీల్‌కి సిద్ధమైపోయింది. ప్రోమో అయితే అదిరిపోయింది. త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది ఈ వెబ్ సిరీస్.

తమన్నా మాత్రమే కాదు, ఇందులో ‘సీతారామం’ ఫేం మృనాల్ ఠాకూర్ కూడా వుందండోయ్. ఇకనేం, తమన్నా – మృనాల్.. ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నారన్నమాట.
వెబ్ సిరీస్‌లంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సినిమాల్ని మించి, స్టార్ కాస్టింగ్ వుంటోంది.!
అదే అడ్వాంటేజ్.!
వెండితెరపై చూపించలేని కొన్ని అంశాలు, సెన్సార్ కత్తెరకు భయపడకుండా ‘వెబ్ సిరీస్’లలో దర్శనమిచ్చేస్తాయ్. అదే అడ్వాంటేజ్ మరి.!
Also Read: Urvashi Rautela Bro.. ‘ఖుషీ’ ఖుషీగా ఊర్వశి.!
అందాల భామలు అస్సలు మొహమాటపడటం లేదు హాట్ కంటెంట్ విషయంలో. ఇంతకీ, మొదటి ‘లస్ట్ స్టోరీస్’ని మించి, రెండో ‘లస్ట్ స్టోరీస్’ హిట్టవుతుందా.?
ఎందుకు అవదూ.. అక్కడున్నది మృనాల్ ఠాకూర్.. అంతకు మించి తమన్నా భాటియా.!