Tamannah Bhatia Sogasari Mudra.. సొగసరి తమన్నా చీరకట్టులో ఇంకాస్త స్పెషల్‌గా అందాల్ని వడ్డించేయగలదు. ఇదిగో, ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి.?
వయసుతో పాటూ తమన్నాకి అందం పెరుగుతూ వస్తుందంటే అతిశయం కాదేమో. అందుకు సాక్ష్యం ఈ తాజా పోజులే అనడం కూడా అతిశయం అంత కన్నా కాదు.
బ్లాక్ కలర్ శారీలో స్టైలిష్‌గా కనిపిస్తూనే వలపుల కవ్వింతలు వడ్డిస్తోంది అందాల తమన్నా. ఫ్రంట్ అండ్ బ్యాక్ పోజులతో నెటిజనాన్ని తెగ మురిపించేస్తోంది.
Tamannah Bhatia Sogasari Mudra.. నచ్చినా నచ్చకపోయినా మిల్కీ బ్యూటీనే..
తమన్నా పనైపోయిందనుకున్న ప్రతీ సారి మళ్లీ ఎగసిన కెరటంలా పైకి లేచొస్తుంది. స్పెషల్ సాంగ్స్ కావచ్చు.. స్పెషల్ రోల్స్ కావచ్చు.. మెగా హీరోయిన్‌గా అవకాశాలు కావచ్చు..
ఇలా చెప్పుకుంటూ పోతే, తమన్నా కెరీర్‌లో అంతకు మించి అనేలా ఆఫర్లు దక్కించుకుంటూనే వుంది. ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా.. నార్త, సౌత్ కూడా దున్నేస్తోంది మిల్కీ బ్యూటీ.

మిల్కీ బ్యూటీ అని పిలిస్తే తనకు నచ్చదని చెబుతుంటుంది కానీ, ముట్టుకుంటే కందిపోయే అందాన్ని సొంతం చేసుకున్న తమన్నాని ఇంకెలా పిలవాలి.
‘స్పెషల్’ స్వింగ్ జరజర..
అందుకే, ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కూడా అలాగే పిలిపించుకుంది తమన్నా. అదేనండీ.! ‘భోళా శంకర్’ సినిమాలో ఏకంగా మిల్కీ బ్యూటీపై అందమైన పాటే రాసేశారు మన గేయ రచయితలు.
ఆ పాటలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి అందంగా చిందులేసేసింది అందాల తమన్నా. అంతేనా, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘జైలర్’లో ‘వా నువ్వు కావాలయ్యా..’ అంటూ స్పెషల్ సాంగ్‌లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
Also Read: Malavika Mohanan.. బ్యూటీ ఆఫ్ డిగ్నిటీ.!
ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్‌లో తమన్నా నటించబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఐటెం సాంగ్స్ యందు తమన్నా ఐటెం సాంగ్స్ స్పెషలయా.! అంటే అతిశయోక్తి కాదేమో.
అలా, ఒకవేళ జరుగుతున్న ప్రచారం నిజమైతే, బాలయ్య 109 కోసం అదిరిపోయే మాస్ స్పెషల్ సాంగ్‌తో మళ్లీ తమన్నా చిందులు చితకేసేయడం ఖాయమే.!