Table of Contents
జనసేన పార్టీకి (Jana Sena Party) ‘మెగా’ బలం (Mega Support to Janasena).. మెగా బ్రదర్ నాగబాబు (Nagababu), తన తమ్ముడి పార్టీ జనసేన కోసం 25 లక్షల విరాళం ఇచ్చారు. అంతే కాదు, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తరఫున జనసేన పార్టీకి 1 కోటి విరాళం ప్రకటించబడింది.
కుటుంబం నుంచి వస్తోన్న ఈ మద్దతుతో జనసేనాని (Janasenani) పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan) ఆనందం వ్యక్తం చేశారు. కొన్నాళ్ళ క్రితం జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన పవన్‌కళ్యాణ్ మాతృమూర్తి అంజనాదేవి, తనవంతుగా తన సొంత డబ్బుని విరాళంగా ప్రకటించిన విషయం తెల్సిందే.
కొన్నేళ్ళక్రితం మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), ప్రజారాజ్యం పార్టీని (Praja Rajyam Party) స్థాపిస్తే.. ఆ పార్టీ కోసం పవన్‌కళ్యాణ్ పడ్డ కష్టం అందరికీ తెలుసు. చిరంజీవి భద్రత దగ్గర్నుంచి, పార్టీ సిద్ధాంతాల వరకు.. అన్ని కార్యక్రమాల్నీ దగ్గరుండి పర్యవేక్షించారు పవన్‌కళ్యాణ్.
అప్పట్లో అభిమానుల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు నాగబాబు ప్రయత్నించారు. మొత్తంగా మెగా కాంపౌండ్ (Mega Support to Janasena) అంతా ఒక్కటై, ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేసింది. అయితే, కొన్ని సమీకరణాల నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ అంచనాల్ని అందుకోలేకపోయింది.

pawan kalyan with charan, chiranjeevi
ప్రజారాజ్యం నేర్పిన పాఠం
అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాలేకపోవడం, ఎక్కువకాలం నిలదొక్కుకోలేకపోవడం వెనుక కారణాల్ని విశ్లేషించిన తమ్ముడు పవన్‌కళ్యాణ్, ఈసారి జనసేన విషయంలో ఎలాంటి పొరపాట్లూ లేకుండా వుండాలని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే, పార్టీ నిర్మాణం కోసం ఎక్కువ సమయం తీసుకున్నారు. రాజకీయాల్ని ఔపోసన పట్టారు కూడా.
2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ (Telugu Desam Party, Bhratiya Janata Party) కూటమికి మద్దతిచ్చినా, ఆ తర్వాత క్రమక్రమంగా ఆ రెండు పార్టీలకు దూరమై, జనసేన పార్టీ సొంత భావజాలంతో ఒంటరిగా రాజకీయ ప్రయాణానికి సిద్ధమయ్యింది. ఈ క్రమంలో జనసేన ఎన్నో పాఠాల్ని కూడా నేర్చుకుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అలా నేర్చుకున్న పాఠాలు, పార్టీకి బలాన్నిచ్చాయని నమ్ముతోన్న జనసేన 2019 ఎన్నికల కోసం సమాయత్తమవుతోంది.

Pawan Kalyan with Ram Charan
మెగా బ్రదర్స్.. ఐక్యతే బలం.!
ఎవరు ఏమనుకున్నా సరే, మెగా కాంపౌండ్‌లో విభేదాలకు తావే లేదు. భిన్నాభిప్రాయాలు ఎక్కడైనా వుండొచ్చు. అన్నదమ్ముల మధ్యా అవి మామూలే. ‘మా ఇద్దరి రాజకీయ ఆలోచనలు వేరు. లక్ష్యం మాత్రం ఒకటే. ప్రయాణించే మార్గాలు భిన్నం కాబట్టి, ఒకరితో ఒకరు కలిసి నడవలేం..’ అని పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పారు. పవన్‌కళ్యాణ్‌దీ ఇదే మాట.
అయితే, అవసరం వచ్చినప్పుడు తామంతా ఒక్కటేనని పలు సందర్భాల్లో మెగా కాంపౌండ్ (Mega Compound) చాటి చెప్పింది కూడా. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవన్ వెళ్ళకపోవడం వివాదాస్పదమయిన మాట వాస్తవం. అయితే, అన్నయ్య ఇమేజ్ ఆకాశం.. ఆ అన్నయ్యకి, తన మద్దతు అవసరమా.? అన్న ఆలోచన పవన్ చేయడాన్ని ఎలా తప్పుపట్టగలం?
చిరంజీవి మీద ఈగ వాలనివ్వకుండా చూసుకునే తమ్ముళ్ళు, తమ్ముళ్ళ మీద ఎవరన్నా నోరు జారితే ఊరుకోని అన్నయ్య.. ఇంతకన్నా మెగా బంధం ఇంకెక్కడుంటుంది.?
బాలయ్యతో నాగబాబుకేంటి వైరం.?
‘బాలయ్య (Balakrishna) ఎవరో నాకు తెలియదు’ అని నాగబాబు అనడంపై నందమూరి బాలకృష్ణ అభిమానులు గుస్సా అయ్యారు. కానీ, అదే బాలకృష్ణ ‘పవన్‌కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు’ అని అనడమేంటి.? బాలయ్య అన్నారు కాబట్టే, నాగబాబు కౌంటర్ ఇచ్చారన్నది మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న సమాధానం. ఇదే విషయాన్ని వరుణ్ తేజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా.
తాజాగా నాగబాబు, సోషల్ మీడియాలో ఓ పిల్లాడు ‘సారే జహాసే అచ్చా’ పాట పాడుతున్న వీడియో పోస్ట్ చేయడాన్ని కొందరు వివాదాస్పదం చేస్తున్నారు. కానీ, ‘గుమ్మడికాయల దొంగ’ అనగానే భుజాలు తడుముకుంటున్న వైనం తప్ప, ఇందులో తప్పుపట్టడానికేమీ లేదు.
మెగా రాజకీయం 2019లో చూస్తాం.! (Mega Support to Janasena)
పవన్‌కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా.? లేదా.? అన్నది పక్కన పెడితే, జనసేన పార్టీ ఓ రాజకీయ శక్తిగా 2019 ఎన్నికల్లో సత్తా చాటబోతోందన్నది నిర్వివాదాంశం. ఈ క్రమంలో నాగబాబు మాత్రమే కాదు, చిరంజీవి కూడా తమ్ముడికి అండగా నిలవబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు.
‘సమయం వచ్చినప్పుడు.. మేమంతా జనసేనకు అండగా (Mega Support to Janasena) నిలబడ్తాం’ అని ఇప్పటికే నాగబాబు క్లారిటీ ఇచ్చేశారు కూడా.
రామ్‌చరణ్ (Mega Power Star Ram Charan), అల్లు అర్జున్ (Stylish Star Allu Arjun), సాయిధరమ్ తేజ్ (Supreme Hero Sai Dharam Tej).. ఇలా ప్రతి ఒక్కరూ ‘జనసేన’ పట్ల సానుకూలంగా ఇప్పటికే పలు సందర్భాల్లో స్పందించిన సంగతి తెల్సిందే.