Tanya Maniktala Fashion Mudra.. ఎవరీ బ్యూటీ.! అసలేంటీ నగ.! చెవి పోగు గురించి విన్నాంగానీ, ఆ చెవి కంటే పెద్దదైన నగ.. అరుదుగా చూస్తుంటాం.!
కాదేదీ కవితకనర్హం.. అంటాడో మహా కవి.! కాదేదీ, ఆభరణానికి అనర్హం.. అనుకోవాలిప్పుడు.!
ఆభరణం అందాన్నిస్తుందా.? ఆభరణానికే అదనపు అందం వస్తుందా.? అంటే, మగువ అందమే, ఆభరణానికి అదనపు ఆకర్షణనిస్తుందన్నది నిర్వివాదాంశం.
అయినాసరే, మగువకి ఆభరణాలంటే మక్కువ ఎక్కువ.! తమ అందాన్ని నగలతో రెట్టింపు చేసుకోవచ్చనుకుంటుంటారు భామామణులు.!
కానీ, అందాల భామలకి తెలియని విషయమేంటంటే, ఆభరణాలకే సొగసులద్దుతుంటారు తమ గ్లామరుతో.!
ఈ నగ, దాని ద్వారా కుర్రకారుకి తగులుతున్న సెగ.. వెరసి, చక్కనమ్మ ఏం చేసినా అందమే.. అనిపించకమానదు.
Tanya Maniktala Fashion Mudra.. ట్రెండ్ సెట్ చేస్తారంతే..
ట్రెండ్ ఫాలో అవడం కాదు, ట్రెండ్ సెట్ చేయడానికే మహిళలు మొగ్గు చూపుతుంటారు, ఫ్యాషన్ విషయంలో.!
ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంలో ఏముంది.? ఏ లోహంతో తయారైతేనేం, తమ అందాన్ని మరింత ఎలివేట్ చేసి చూపించేలా నగలుండాలనుకుంటున్నారు నేటితనం మహిళామణులు.
అందుకే, మార్కెట్లోకి సరికొత్త డిజైన్లతో ఆభరణాలు దూసుకొస్తున్నాయి. లక్ష దాటేసిన బంగారంతో ఇలాంటి ఆభరణాలంటే, అంతే సంగతులు.!

అలాగని, మార్కెట్‌లో బంగారాన్ని తలపించే ఈ తరహా నగలు తక్కువ ధరకే దొరికేస్తున్నాయనుకుంటే పొరపాటే.! డిజైన్‌ని బట్టి, పది వేలు.. ఆ పైన కూడా పలుకుతున్నాయ్.
కట్టిన చీర మళ్ళీ కట్టకూడదు.. పెట్టిన నగ మళ్ళీ పెట్టకూడదు.. అనే ఆలోచనలో వుంటుంటారు చాలామంది మహిళామణులు.
అందరిలోకీ తాము చాలా ప్రత్యేకం.. అనిపించుకోవాలంటే, ఆ మాత్రం ‘ట్రెండీ కేర్’ తీసుకోకపోతే ఎలా.?
Also Read: బాబోయ్ అమ్రికా.!? ఫర్లేదు.. మరీ అంత భయం లేదు లేవోయ్.!
నిజమే మరి.! ఆమె అంటేనే ప్రత్యేకం.! ఆమె మరింత ప్రత్యేకంగా వుండాలంటే.. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్స్ ఫాలో అవ్వాల్సిందే మరి.!
ఫొటోలో, నెమలి.. చెవికెక్కేసింది.! సరికొత్త గ్లామరద్దేసింది.! డిజైనర్ ఎవరోగానీ, ఆ ‘థాట్’ నెక్స్‌ట్ లెవల్.. అంతే.!
ఇంతకీ, ఫొటోలో వున్న బ్యూటీ ఎవరో చెప్పనే లేదు కదా.! పేరేమో తాన్యా మనిక్‌తల.! పలు హిందీ వెబ్ సిరీస్‌లలో నటించిందీ బ్యూటీ.!
