Taraka Ratna Death Mystery.. సినీ నటుడు నందమూరి తారక రత్నకి తీవ్ర గుండె పోటు రాగా, 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి, తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
నిండా నలభయ్యేళ్ళు కూడా లేని తారకరత్న.. ఇలా తీవ్ర గుండె పోటుకి గురై అకాల మరణం చెందడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
కొన్నాళ్ళ క్రితమే ఏపీ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా చిన్న వయసులోనే గుండె పోటు కారణంగా అకాల మరణం చెందారు. కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్‌ది కూడా ఇదే పరిస్థితి.
Taraka Ratna Death Mystery.. చావులోనూ రాజకీయమేనా.?
కుప్పంలో నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా, ఆ పాదయాత్రల్లో పాల్గొన్న తారకరత్న, ఆ రోజే గుండె పోటుకి గురయ్యారు.
బతికున్నోళ్ళని ఎలాగూ విమర్శలతో చంపుకు తింటారు.!
చనిపోయాక అయినా వదిలిపెట్టరా.? ‘బంధుత్వం’ పేరుతో రాబందుల్లా వ్యవహరించేవాళ్ళని ఏమనాలి.?
మానవ మృగాలు.. అనడం కంటే, కఠినమైన పదాన్ని వాడాలేమో.!
Mudra369
దాంతో, తారకరత్న మరణానికి లోకేష్ కారణమన్న ప్రచారాన్ని టీడీపీ రాజకీయ ప్రత్యర్థి వైసీపీ తెరపైకి తెచ్చింది.
ఆ వైసీపీకి చెందిన నేత లక్ష్మీపార్వతి అయితే, తారకరత్న ఎప్పుడో చనిపోయాడనీ, చనిపోయిన వ్యక్తిని.. బతికి వున్నట్లుగా ప్రచారం చేసి, ఇన్నాళ్ళూ డ్రామాలు ఆడారని ఆరోపిస్తున్నారు.
అభిమానులు, కుటుంబ సభ్యుల్ని క్షోభకు గురిచేయడమే..
తారకరత్నకు ముగ్గురు పిల్లలున్నారు.. ముగ్గురూ చిన్నవారే. గుండెలవిసేలా రోదిస్తున్నారు వారంతా.
తారకరత్న సతీమణి, ఆ పిల్లలు.. ఎంత వేదన చెందుతున్నారన్న కనీసపాటి విజ్ఞత సంస్కారం వదిలేసి, ‘ముందే చనిపోయాడు’ అని పేర్కొనడం లక్ష్మీపార్వతి లాంటివాళ్ళకు సబబేనా.?
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
రాజకీయం ఏమైనా మాట్లాడిస్తుంది. అదే రాజకీయమంటే. స్వర్గీయ ఎన్టీయార్ సతీమణినని చెప్పుకునే లక్ష్మీపార్వతి, ఆ కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోతే ఇలాగేనా మాట్లాడేది.?
అదే వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి ఎంత హుందాగా వ్యవహరించారు.? లక్ష్మీపార్వతి ఎందుకు గబ్బు పుట్టించే రాజకీయం చేశారు.?